BJP MP Locket Chatterjee: ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ ( Hathras ) లో జరిగిన దురాఘతంపై దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించారు. దీంతో ఆ బాధితురాలు సెప్టెంబరు 14 నుంచి ప్రాణాలతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్జంగ్ ఆసుపత్రిలో 29న మంగళవారం కన్నుమూసింది. ఆ రోజే పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతి లేకుండా పోలీసులు అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. హైదరాబాద్ దిశా (Disha) నిందితుల తరహాలో నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలని.. విపక్షాలన్నీ యూపీ బీజేపీ యోగి ప్రభుత్వాన్ని (Yogi Government) చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై ప్రతిపక్షమే కాకుండా ఇప్పుడు బీజేపీ (BJP) నాయకుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ (MP Locket Chatterjee) ఆగ్రహం వ్యక్తం చేశారు. Also read: Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్
ఈ దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాలను బహిరంగంగా కాల్చి చంపాలని పశ్చిమ ఎంపీ లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు. ఆ దుర్మార్గులను ఏమాత్రం ఉపేక్షించవద్దని ఆమె పేర్కొన్నారు. హత్రాస్ ఘటనను రాజకీయాలకు ముడిపెట్టకూడదని.. దోషులను ప్రజల ముందుకు లాక్కొచ్చి ఎన్కౌంటర్ చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. వారి క్రూరత్వం పరిమితులను మించిపోయిందని.. నేరగాళ్లపై ఎలాంటి కనికరం చూపించకుండా శిక్షించాలని ఛటర్జీ కోరారు. అయితే.. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన అనంతరం ఛటర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. లాకెట్ ఛటర్జీ బెంగాల్ హుగ్లి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Also read: Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు