CM Yogi Adityanath suspends top police officials: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras case) ‌లో జరిగిన దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు దుండగుల చేతిలో అత్యాచారానికి (Hathras gang-rape) గురై చనిపోయిన యువతికి న్యాయం చేయాలంటూ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ మేరకు ప్రజలతోపాటు.. విపక్షాలు యూపీ యోగి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఘటనలో పోలీసుల ప్రవర్తనపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హత్రాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ (police suspends) చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు పోలీసు అధికారులకు, నిందితులకు, బాధితురాలి కుటుంబసభ్యులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. Also read: Hathras case: వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు: సీఎం యోగి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హత్రాస్ ఉందంతంపై దర్యాప్తు చేస్తోన్న సిట్ బృందం ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా.. దుర్వినియోగ ఆరోపణలపై పలువురు పోలీసు అధికారులపై యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సస్సెండ్ అయిన వారిలో.. ఎస్పీ విక్రాంత్ వీర్, సీవో రామ్ షాబ్ద్, ఇన్స్పెక్టర్ దినేష్ కుమార్ వర్మ, ఎస్ఐ జగ్వీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ మహేష్ పాల్ ఉన్నారు. అంతేకాకుండా.. పోలీసు అధికారులు, నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సిట్‌ బృందం ప్రభుత్వాన్ని కోరింది.  Also Read : Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ 


సప్టెంబరు 14న పొలం పనులు చేస్తున్న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో మంగళవారం ( సెప్టెంబరు 29న) కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు బలవంతంగా దహనం చేశారు. అయితే ఈ ఘటనపై మూడురోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.  Also read: Hathras Case: నిన్న రాహుల్ గాంధీ.. నేడు డెరిక్ ఓబ్రెయిన్‌.. అలాగే కింద‌ప‌డేశారు!