ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ గ్యాంగ్ రేప్ (Hathras Gang Rape) వివాదం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలోనూ తీవ్ర నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా పోలీసుల తోపులాటలో కింద పడిపోవడం తెలిసిందే.
నేడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, నేతల టీమ్ యూపీలోని హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ (TMC MP Derek OBrien)తో పాటు టీఎంసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాట వినకుండా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ముందుకు సాగుతున్న నేతల్ని తోసేయడంతో ఎంసీ డెరిక్ ఓబ్రెయిన్ అమాంతం కింద పడిపోయారు. అచ్చం నిన్న రాహుల్ గాంధీకి ఎదురైన చేదు అనుభవమే నేడు టీఎంసీ సీనియర్ నేత డెరిక్ ఓబ్రెయిన్‌కు ఎదురైంది.
#WATCH: TMC delegation being roughed up by Uttar Pradesh Police at #Hathras border. The delegation, including Derek O'Brien, was on the way to meet the family of the victim of Hathras incident. pic.twitter.com/94QcSMiB2k
— ANI (@ANI) October 2, 2020
హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటికి దాదాపు చేరుకున్నామని టీఎంసీ నేతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 1.5 కి.మీ దూరం ప్రయాణిస్తే హత్రాస్‌లో బాధితురాలి కుటుంబాన్ని కలుసుకుంటారనగా పోలీసులు అడ్డుకుని వెనక్కి నెట్టగా టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కింద పడిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, పొలంలో పనిచేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిని కొందరు యువకులు కొంతదూరం లాక్కెళ్లి ఆమె మెడపై దాడి చేసి వెన్నెముక విరగ్గొట్టి నరకం చూపించారు. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి యువతి నగ్నంగా తీవ్ర గాయాలతో పడి ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోవడం తెలిసిందే. అయితే ఫోరెన్సిక్ రిపోర్టులలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలిందని ఎస్పీ చెప్పడం గమనార్హం. అలాంటప్పుడు అర్ధరాత్రి కుటుంబానికి చెప్పకుండా బాధితురాలి అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read : Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe