కరోనా సంక్షోభ సమయం ( Corona crisis period ) లో లోన్ మారటోరియం ( Loan moratorium ) ఉపయోగించుకోలేదా..చక్కగా వాయిదాలు కట్టుకుంటూ వెళ్లారా. అయితే మీకొక శుభవార్త. క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో మార్చి నుండి ఆగస్టు వరకు 6 నెలల కాలానికి ఆర్బీఐ ( RBI ) తాత్కాలిక రుణ నిషేధం ప్రకటించింది. వెసులుబాటు వచ్చింది కదా అని చాలామంది లోన్ మారటోరియంను ఉపయోగించుకున్నారు. మరి కొంతమంది ఈఎంఈలను కట్టుకుంటూ వెళ్లారు. మారటోరియం ఉపయోగించుకున్నవారికి ఇప్పుడు అసలు కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకులు ఆ ఆరు నెలల కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్నాయి. దాంతో కొందరు సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించగా..వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఎవరెవరికి వడ్డీ రాయితీ లభిస్తుందనేది కూడా మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. 


మరి లోన్ మారటోరియం వినియోగించుకోకుండా..ఈఎంఈలు సక్రమంగా చెల్లించినవారి పరిస్థితి ఏంటి? అలాంటివారికి క్యాష్ బ్యాక్ రూపంలో నగదు అందించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటనైతే వెలువడలేదు కానీ..కచ్చితంగా బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. 


క్యాష్ బ్యాక్ ఆఫర్ అన్ని వ్యక్తిగత రుణాలతో పాటు చిన్న వ్యాపారులకు సైతం అందుబాటులో ఉంచనుంది. లోన్ మారటోరియం సద్వినియోగం చేసుకున్నవారికి చెందిన వడ్డీపై వడ్డీ ( Interest on Interest ) మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించనుంది. సక్రమంగా ఈఎంఈ ( EMI ) చెల్లించినవారికి మాత్రం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభించనుందని తెలుస్తోంది. 


క్యాష్ బ్యాక్ పధకం ప్రకారం అత్యధికంగా 32 వేల క్యాష్‌బ్యాక్ పొందవచ్చంటున్నారు. 2 కోట్ల గృహరుణంపై ఈఎంఈ చెల్లించినవారికి దాదాపు 32 వేల క్యాష్ బ్యాక్ వస్తుందని అంచనా. అంటే 8 శాతం వడ్డీ రేటు ప్రకారం లెక్కించినట్టు సమాచారం. ఈ క్యాష్ బ్యాక్ నేరుగా మీ అక్కౌంట్ కు క్రెడిట్ అవుతుందట.  Also read: Kapil Dev: ఆసుపత్రి నుంచి కపిల్ దేవ్‌ డిశ్చార్జ్