Former cricketer kapil dev discharged from hospital: న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కు మూడు రోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీ (Delhi) ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో.. వైద్యులు కపిల్ దేవ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే కపిల్ దేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని మాజీ క్రికెటర్, బీఎస్పీ నాయకుడు చేతన్ శర్మ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్, డాక్టర్ అతుల్ మాథుర్ దిగిన ఫోటోను చేతన్ శర్మ షేర్ చేశారు.
Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020
మాజీ క్రికెట్ రథసారధి కపిల్ దేవ్‌కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే క్రికెట్ దిగ్గజం కపిల్ కోలుకోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : 1983 Cricket World Cup : భారత్ విశ్వవిజేతగా నిలిచిన మ్యాచ్ నుంచి ఆసక్తికరమైన అంశాలు
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. 1983లో భారత్‌కు వన్డే ప్రపంచ కప్ (World Cup) అందించారు. దాదాపు ఆయన 16 ఏళ్లపాటు భారత జాతీయ క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. 131 టెస్టులు, 225 వన్డేలలో టీమిండియాకు కపిల్ దేవ్ ప్రాతినిథ్యం వహించి ఆయన భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారు.
Also read: Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe