Health Minister Dr Mansukh Mandaviya advises States to be on the Corona alert: చైనా, అమెరికా, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరగడంతో, ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా పట్ల అప్రమత్తత పెరిగింది. ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోవిడ్-19 పరిస్థితి, దానికి ఎంతవరకు సంసిద్దంగా ఉన్నామనే విషయం మీద అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సమావేశంలో నూతన సంవత్సరాది, రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాకు సంబంధించిన కొన్ని కొత్త సూచనలు జారీ చేయవచ్చని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని కొత్త సూచనలు జారీ చేసింది కేంద్రం. మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త కేసులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు అని హెచ్చరించారు.


అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కు బూస్టర్ డోసులు వేయించేలా చర్యలు తీసుకోవాలని మాండవియా మంత్రులను సూచించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని సూచించిన ఆయన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని, షాపింగ్ మాల్స్, ఏసీ గదులు, హోటల్స్, మల్టీప్లెక్సుల్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు.


ఇక మరోపక్క పండుగలు, నూతన సంవత్సర వేడుకలకు ముందు కేంద్రం ఇచ్చిన ముఖ్యమైన సూచనలు కూడా కొన్ని ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని 'టెస్ట్-ట్రాక్-ట్రీట్ మరియు వ్యాక్సినేషన్' అలాగే మాస్క్‌లను సిద్ధం చేయాలని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. మాస్కులు ధరించడం మరియు సామాజిక దూరంపై దృష్టి పెట్టాలని సూచించారు.


రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 నిర్వహణ కోసం అన్ని సన్నద్ధతలో ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంత్రులకు సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు గతంలో చేసినట్లుగానే సహకార స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  కరోనా పరీక్షలను పెంచాలని మరియు ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించాలని కూడా వారిని కోరారు ఆయన.


Also Read: Krishnam Raju Wife Shyamala : కృష్ణంరాజు భోజనానికి పిలిస్తే అలా చెప్పిన కైకాల.. చనిపోయాక బయటపెట్టిన శ్యామల!


Also Read: Vijay Most popular star: ఒక్క పాన్ ఇండియా మూవీ లేకుండా పాన్ ఇండియా నెం1 అంటే నమ్మడమెలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.