Vijay Most popular star: ఒక్క పాన్ ఇండియా మూవీ లేకుండా పాన్ ఇండియా నెం1 అంటే నమ్మడమెలా?

Vijay Stood as No1 Hero: ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్ట్ విడుదల చేసింది, ఈ లిస్టు విడుదల చేసిన ప్రతిసారి విజయ్ కి మొదటి స్థానం ఎందుకు వస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 23, 2022, 05:54 PM IST
Vijay Most popular star: ఒక్క పాన్ ఇండియా మూవీ లేకుండా పాన్ ఇండియా నెం1 అంటే నమ్మడమెలా?

Vijay Stood as No1 in Most popular male film stars List in Pan India: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ మీడియా ఎప్పటిలాగే విడుదల చేసే ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్ట్ విడుదల చేసింది. నవంబర్ నెలకు గాను విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ టెన్ లో మరోసారి ఐదుగురు టాలీవుడ్ హీరోలు స్థానం దక్కించుకున్నారు. అయితే మొదటి స్థానాన్ని ఎప్పటిలాగే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండానే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ దక్కించుకున్నాడు.

రెండవ స్థానాన్ని ఫస్ట్ తెలుగు పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ నిలబెట్టుకోగా మూడవ స్థానంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ నాలుగవ స్థానం దక్కించుకుంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన అల్లు అర్జున్ ఐదవ స్థానం దక్కించుకున్నాడు. ఇక కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న యష్ ఆరవ స్థానం దక్కించుకుంటే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఏడో స్థానం దక్కించుకున్నాడు.

ఇక ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండానే మహేష్ బాబు ఎనిమిదో స్థానం దక్కించుకోగా షారుక్ ఖాన్ మాత్రం తొమ్మిదవ స్థానం దక్కించుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాట్టిన రామ్ చరణ్ పదవ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అయితే ఈ లిస్టు విడుదల చేసిన ప్రతిసారి విజయ్ కి మొదటి స్థానం ఎందుకు వస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే విధమైన చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా తమిళంలో అజిత్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అజిత్ కి ఏడవ స్థానం ఇవ్వడం విజయ్ కి మొదటి స్థానం ఇవ్వడంతో ఈ లిస్ట్ ఫేక్ అని డబ్బులతో విజయ్ దీన్ని మేనేజ్ చేస్తున్నాడు అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగు అభిమానులు మాత్రం అసలు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేకుండా విజయ్ కి ప్రతిసారి ఈ పాన్ ఇండియా లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఎలా వస్తుంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Raviteja - BVS Ravi: డైరెక్టర్ ను చితక్కొట్టిన రవితేజ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Also Read: Krishnam Raju Wife Shyamala : కృష్ణంరాజు భోజనానికి పిలిస్తే అలా చెప్పిన కైకాల.. చనిపోయాక బయటపెట్టిన శ్యామల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News