Tamilnadu: తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో కలవరం రాజేస్తోంది. పార్టీలో వర్గాలు రాజుకుంటున్నాయి. శశికళ పార్టీని మళ్లీ చేజిక్కించుకోగలరా..అసలేం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో (Tamilnadu) ముసలం మొదలైంది. ప్రతిపక్షం అన్నాడీఎంకే పార్టీలో రాజకీయం వేడెక్కుతోంది. శశికళ వర్గానికి, వ్యతిరేక వర్గానికి ఘర్షణ రాజుకుంటోంది. ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన శశికళ..ఇటీవల మళ్లీ పావులు కదుపుతున్నారు. పార్టీలో కొందరితో టచ్‌లో ఉంటూ చర్చలు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తమైన శశికళ వ్యతిరేకవర్గనేతలు కొందరిపై వేటు వేశారు. శశికళతో మాట్లాడుతున్నవారిని పార్టీ నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ప్రకటన చేయడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. శశికళ (Sasikala) ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని..అన్నింటినీ చక్కదిద్దుతానని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన అనంతరం దూకుడు పెంచనున్నారు. ఇందులో బాగంగా అన్నాడీఎంకే దివంగత నేతలైన ఎంజీఆర్, జయలలిత (Jayalalitha) హయాంలో పార్టీకై శ్రమించిన సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. కార్యకర్తలతో మాట్లాడి భరోసా కల్పించారు. తాను మళ్లీ రావడం ఖాయమని..అన్నాడీఎంకే పార్టీని కైవసం చేసుకుందామని ధైర్యం చెప్పారు. 


మధురై, తేని జిల్లాల్లోని అన్నాడీఎంకే (AIADMK) నేతలు, పార్టీ అనుబంధన ఎంజీఆర్ యూత్ విభాగం నేతలు కొందరితో శశికళ ఫోన్‌లో మాట్లాడారు. పార్టీని రక్షించుకోవల్సిన ఆవశ్యం ఏర్పడిందన్నారు. జయలలిత ఆశయాల దిశగా తన ప్రయాణం ఉంటుందన్నారు. కార్యకర్తలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభావం చూపించలేని బీజేపీ(BJP), పీఎంకే వంటి చిన్నపార్టీలకు అన్నాడీఎంకేను తాకట్టు పెట్టారని అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన అధికార ప్రతినిధి తెలిపారు. 


Also read: Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో అనుమానితుల ఫుటేజి విడుదల చేసిన ఎన్ఐఏ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook