Bengaluru Floods:  కర్ణాటక రాజధాని బెంగళూరు జలమలమైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. మహా నగరంలోని పలు ప్రాంతాలు సముద్రంలా మారిపోయాయి. వందలాది కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తమైంది. వరద పోటెత్తడంతో కొన్ని ప్రాంతాలు రోజుల తరబడి వరదల్లోనే ఉన్నాయి. తాజాగా ఆదివారం రాత్రి బెంగళూరులో కుండపోతగా వర్షం కురిసింది. గత 24 గంటల్లో సీవీ రామన్ నగరంలో అత్యధికంగా 44 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లోనూ 20 నుంచి 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో వందలాది కాలనీలను వరద ముంచెత్తింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరు రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూలిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్లలోకి వరదనీరు చేరడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కల్గింది. బెళ్లందూర్‌, షార్జా పురా రోడ్డు, అవుట్‌ రింగ్‌ రోడ్‌, బీఈఎంఎల్‌ లేఅవుట్‌ తదితర ప్రాంతాలు నీటమునిగాయి.



కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.



బెంగళూరు ఐటీ కారిడార్ ను మరోసారి వరద ముంచెత్తింది. ఆగస్టు 30 రాత్రి కురిసిన వర్షానికి ఐటీ సంస్థలున్న ప్రాంతాల జలమయమైంది. వరదలతో ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు రాలేకపోయారు. ఆ ఒక్క రోజే వరదలు, ట్రాఫిక్ వల్ల 225 కోట్ల రూపాయలు నష్టపోయామని  ఔటర్ రింగ్ రోడ్ కంపెనీస్ అసోసియేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది. తాజాగా ఆదివారం కురిసిన వర్షానికి మళ్లీ అలాంటి సీనే కనిపించింది. భారీ వర్షానికి పలు కంపెనీ ఆఫీసుల్లోకి భారీగా వరద  చేరింది. దీంతో అమెజాన్‌, విప్రో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వంటి సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇచ్చాయి. మరోవైపు బెంగళూరుకు సెప్టెంబరు 9 వరకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి