Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్
భారీ వర్షాలతో ఉత్తర భారత దేశంలో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడటమే కాకుండా, నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.. ఆ వివరాలు
ఉత్తర భారతదేశం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసందే. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా కొండా చరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగుతున్న కారణంగా ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొంగి పొర్లుతున్న నదులు, కాలువలు కారణంగా ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరుగుతుంది. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగుతున్న నదుల వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి ప్రతికూల సమయాల్లో నష్టపోయిన వారికి త్వరగా ప్రభుత్వం అండగా నిలబడాలని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ ఆదివారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రాణనష్టం మరింత వాటిల్లకముందే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అతి భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో పెరుగుతున్న నీటి మట్టం కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటం మరియి ఆకస్మిక వరద నీటి కారణంగా రాష్ట్రం అతలాకుతలంగా మారుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు కారణంగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు, ఆస్తి నష్టం కూడా జరిగింది. బియాస్ నది పొంగిపొర్లుతున్న కారణంగా మండి జిల్లాలోని పండోహ్ గ్రామంలో ఇళ్లతో పాటు కార్లు కేసుల వరదలో కొట్టుకుపోయాయి. వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Weather Report Today: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో స్కూల్స్ బంద్
హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా మండిలోని తెగిన పంచవక్త్ర వంతెన దాదాపు అన్ని జిల్లాలను ప్రభావితం చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా చారిత్రక వంతెన కొట్టుకుపోయిందని.. మంది జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అశ్వనీ కుమార్ తెలిపారు. బియాస్ నది పొంగిపొర్లుతున్న కారణంగా.. మంది జిల్లాలోని బంజార్- పండోహ్ గ్రామాల మధ్య ఉన్న వంతెన కూడా తెగిపోయిన కారణంగా రవాణా కూడా పూర్తిగా దెబ్బతింది.
ఇక సిమ్లా జిల్లా వాతావరణ విషయానికి వస్తే చాలా చోట్లో ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఐసోలేటెడ్ ప్రాంతాల్లో మరింతగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. సిమ్లా, సోలన్, కిన్నౌర్, సిర్మౌర్, కాంగ్రా, కులు, మండి, బిలాస్‌పూర్ మరియు హమీర్‌పూర్ జిల్లాల్లో కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగనుందాని తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా-చండీగఢ్ పరిసర జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Also Read: World Cup 2023: ఈ స్టార్ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి