ODI World Cup 2023 Updates: వరల్డ్ కప్ గెలవాలని ప్రతి క్రికెటర్‌కు ఓ కల. ఎందరో దిగ్గజ ప్లేయర్లకు ప్రపంచకప్‌ను ముద్దాడకుండానే రిటైర్మెంట్ అయిపోయారు. పలువురు స్టార్ క్రికెట్ ప్లేయర్లకు చివరి వన్డే వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. త్వరలో 37 ఏళ్లు నిండనున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా తరఫున 142 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌లో వార్నర్‌కు మంచి రికార్డు ఉండడంతో ఆసీస్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది.
2019 ప్రపంచ కప్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మెరుపులు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. వరుసగా సెంచరీలతో టీమిండియాను సెమీస్‌కు చేర్చాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా రోహిత్‌కు ఇదే ఆఖరి ప్రపంచ కప్ అయ్యే ఛాన్స్ ఉంది.
కింగ్ కోహ్లీ టీమిండియా తరఫున 282 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 47 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ వయసు 34 ఏళ్లు కాగా.. ఇదే ఫిట్‌నెస్ ఉంటే మరో వరల్డ్‌కప్‌లో చూడొచ్చు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 2006లో వన్డే కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకు 234 మ్యాచ్‌లలో ఆడాడు. 36 ఏళ్ల షకీబ్‌కు ఇదే చివరి ప్రపంచకప్.
34 ఏళ్ల స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున 142 వన్డేలు ఆడి 44.5 సగటుతో 4939 పరుగులు చేశాడు. వయసు పెరుగుతున్న దృష్ట్యా.. స్మిత్‌కి ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది.