Heavy Rains in Mumbai: ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలననీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయి పొరుగున ఉన్న పాల్‌గఢ్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబై, థానేలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు నల్లసోపారా, వసాయిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, ఘట్‌కోపర్‌, చెంబూర్‌ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో అత్యధికంగా శాంతాక్రూజ్‌ ప్రాంతంలో 203.7 మి.మీల వర్షపాతం నమోదైంది. బాంద్రాలో 160.5 మి.మీలు, విద్యావిహార్‌లో 186 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రహదారులపైకి మోకాల్లోతు నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయిలో 100కి పైగా లోకల్‌ రైళ్లును రద్దు చేశారు. వరదల కారణంగా అంధేరీ సబ్‌వే రాకపోకలను నిలిపివేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులు 10 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా, పశ్చిమ రైల్వే మార్గంలో సర్వీసులు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. 


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు


ఈ రోజు కొంకణ్ మరియు గోవా, మధ్య మహారాష్ట్ర మరియు గుజరాత్‌లోని పలు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ మరియు తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ పేర్కొంది. 


Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook