Heavy rains: 46 ఏళ్ల చరిత్రలో లేనంతగా ఒక్కరోజులో భారీవర్షం
అతి భారీ వర్షాలతో ముంబై ( Heavy rains in mumbai ) దద్దరిల్లిపోతోంది. ముంబై రోడ్లన్నీ సంద్రంగా మారిపోయాయి. ప్రజా జీవితం స్థంబించుకుపోయింది. ట్రాఫిక్స్ నిలిచిపోయింది. ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
అతి భారీ వర్షాలతో ముంబై ( Heavy rains in mumbai ) దద్దరిల్లిపోతోంది. ముంబై రోడ్లన్నీ సంద్రంగా మారిపోయాయి. ప్రజా జీవితం స్థంబించుకుపోయింది. ట్రాఫిక్స్ నిలిచిపోయింది. భారీ వర్షాలకు తోడు గంటకు 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఇప్పటికే సబర్బన్ రైలు, బస్సు సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆగస్టు నెలలో ఇంతటి భారీ వర్షం నమోదవడం గత 46 ఏళ్లలో ఇదే తొలిసారి. అదికూడా ఒక్క రోజులో కురిసిన వర్షపాతం. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు మొత్తం వర్షపాతంలో 64 శాతం ఈ ఐదురోజుల్లోనే కురిసినట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఇంకా కురుస్తాయని వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Cm Udhav Thackeray )..అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదిలో వరద నీరు క్రమంగా పెరుగుతోంది. Also read: Sushant singh: రియా చక్రవర్తికు ఈడీ సమన్లు