Hemant Soren Oath Ceremony: జార్ఖండ్‌లో నేడు కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం - కాంగ్రెస్ కూటమి నుంచి హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండి కూటమి నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. అయితే సోరెన్ మంత్రివర్గ కూర్పు పైన ఆసక్తి కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది కీలకం కాబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమికి రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 56 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 24 స్థానాలు దక్కాయి. దీంతో, తిరిగి అధికారం దక్కించుకున్న సోరోన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు. అయితే ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలకు హేమంత్ సోరెన్  ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ నాలుగు మంత్రి పదవులు కావాలని కోరుతోంది. ఆర్జేడీకి కేబినెట్ లో స్థానం దక్కనున్నట్టు సమాచారం.


సాయంత్రం 4 గంటలకు జరిగే సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఇండియా కూటమి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాంచీలో జరిగే ప్రమాణ స్వీకార వేడుకలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్‌ శరద్‌ వవార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పాల్గొంటారు. జార్ఖండ్‌లో వరుసగా రెండు సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కాని 24 ఏళ్ల ఆ రికార్డును బద్దలుకొట్టి హేమంత్‌ సోరెన్‌ వరుసగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్ట బోతున్నారు.మధ్యలో అరెస్ట్ నేపథ్యంలో చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter