Kalpana Soren: భర్తను తలచుకుని ప్రజల మధ్య కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం భార్య
Kalpana Soren Very Emotional: భర్త జైలుకెళ్లడం.. రాష్ట్రంలో పార్టీ ఒంటరిగా అవడం.. కాచుకు కూర్చున్న ప్రతిపక్షాలు.. మరోవైపు కుటుంబ బాధ్యతలు వీటన్నిటి నేపథ్యంలో ఆమె తట్టుకోలేకపోయింది. జరుగుతున్న పరిణామాలు చూసి తీవ్రంగా దుఃఖించారు.
Kalpana Soren Political Speech: రాజకీయంగా ఎంతో గొప్పగా బతికిన జీవితం ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆమె ప్రజల మధ్యకు వచ్చారు. కుటుంబంలో, రాజకీయాల్లో జరిగిన పరిణామాలతో ఆమె కలత చెందారు. తొలిసారి ప్రజల మధ్యకు వచ్చిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బహిరంగ సభలో మాట్లాడుతూ జరిగిన పరిణామాలను ఊహించుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మైక్ అందుకుంటూనే కన్నీళ్లు ఉబికి వచ్చాయి. దీంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు కూడా మనస్తాపానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమైనది ఎవరో కాదు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.
Also Read: Lock In Assembly: ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి తాళం వేయండి.. స్పీకర్‌కు తాళం ఇచ్చిన సీఎం
కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చ అధినేత, ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ జైలుపాలవడంతో జార్ఖండ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. ఈ అరెస్ట్‌తో అక్కడి రాజకీయ పరిణామాలు మారడంతో అతడి భార్య కల్పనా సోరెన్ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుడిని నియమించినా పార్టీ వ్యవహారాలను కల్పనా సోరెన్ చూసుకునేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Also Read: MP Candidates: బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్
జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ 51వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం గిరిధ్‌లో నిర్వహించారు. ఈ సభలో కల్పనా సోరెన్ మాట్లాడారు. 'భారమైన హృదయంతో ఈరోజు మీ ముందున్నా. మా మామ, మా అత్త అయితే కుమారుడిని తలచుకుని తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇకపై నా బలమంతా కార్యకర్తలే. మీరే' అని ప్రకటించారు. మాట్లాడుతున్న క్రమంలో ఆమె ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించుకునే ప్రయత్నం చేశారు. గద్గద స్వరంతో మాట్లాడారు. ఈ సందర్భంగా భర్త హేమంత్ సోరెన్, మామ శిబూ సోరెన్ పరిస్థితులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
'2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు కక్ష గట్టాయి. మమ్మల్ని కూల్చివేయాలని ప్రతి రోజు కుట్ర పన్నాయి. హేమంత్ సోరెన్ ఏం నేరం చేశాడు? రూ.1.36 లక్షల కోట్ల సంపద సృష్టించడం నేరమా? వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం నేరమా?' అని ప్రశ్నించారు. అందరం ఐక్యంగా ఉండి ప్రతిపక్షాల కుట్రను తిప్పికొడుదామని పిలుపునిచ్చారు. ఓట్లు చీలకుండా అందరూ ఏకతాటిపైకి రావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 'హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి జార్ఖండ్ ఆత్మగౌరవాన్ని జైల్లో బంధించారు. దీనికి ప్రతి బదులు జార్ఖండ్ తప్పక ఇస్తుంది' అని తెలిపారు.
బహిరంగ సభలో కల్పనా రావడం జార్ఖండ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారా? అనే చర్చ మొదలైంది. భర్త హేమంత్ సోరెన్ పాత్రను కల్పనా పోషిస్తారని అక్కడి మీడియా పేర్కొంటోంది. కాగా కల్పనా రాక రాజకీయంగా అంతగా ప్రాధాన్యం లేదని జేఎఎం నాయకులు కొట్టిపారేస్తున్నారు. హేమంత్ సోరెన్‌పై వస్తున్న ఆరోపణలకు బదులిచ్చేందుకు వచ్చారని వివరణ ఇస్తున్నారు. కల్పనా రాజకీయాల్లోకి రావడం లేదని చెబుతున్నారు. ఓ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను జనవరి 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి