Lock In Assembly: ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి తాళం వేయండి.. స్పీకర్‌కు తాళం ఇచ్చిన సీఎం

Lock And Key In Assembly: అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్పీకర్‌కు ముఖ్యమంత్రి లేచి వచ్చి తాళం చెవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అది చూసిన సభ్యులంతా నవ్వుకున్నారు. ఇంతకీ కారణం ఏమిటో..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 4, 2024, 09:01 PM IST
Lock In Assembly: ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి తాళం వేయండి.. స్పీకర్‌కు తాళం ఇచ్చిన సీఎం

Assembly Speaker Key: కీలకమైన చర్చలో సభ్యులందరూ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి పట్టుబట్టారు. విపక్ష సభ్యులంతా సభలోనే ఉండాలని సీఎం కోరారు. ఈ క్రమంలోనే సభ్యులు వాకౌట్‌ చేయకుండా అసెంబ్లీ తలుపులకు తాళం వేయాలని స్పీకర్‌కు తాళం చెవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఈ పరిణామం అసెంబ్లీలో గందరగోళ పరిస్థితికి దారితీసింది. ఈ సంఘటన పంజాబ్‌ అసెంబ్లీలో చోటుచేసుకుంది.

Also Read: Modi Ka Parivar: 140 కోట్ల భారత ప్రజలే నా కుటుంబం.. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ భావోద్వేగం

పంజాబ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు సోమవారం ప్రారంభమవగా గవర్నర్‌ ప్రసంగంపై విపక్ష సభ్యులు అడ్డుతగిలారని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చ జరగాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వన్‌కు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ జీరో అవర్‌, క్వశ్చన్‌ అవర్‌ను రద్దు చేసి ప్రత్యేక చర్చకు అనుమతిచ్చారు. ఈ చర్చ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ లేచి స్పీకర్‌ వద్దకు వచ్చారు.

Also Read: MP Candidates: బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్‌

ఓ కవర్‌లో ఉన్న తాళం, తాళం చెవిని స్పీకర్‌కు అందించారు. అసెంబ్లీ లోపల నుంచి తాళం వేయాలని కోరారు. తాళం వేయడంతో విపక్ష సభ్యులు చర్చ నుంచి బయటకు వెళ్లకుండా ఉంటారని తెలిపారు. సభ్యులందరూ చర్చలో తప్పకుండా ఉండాలని సూచించారు. తాళం ఇవ్వడంపై విపక్ష నాయకుడు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా స్పందించారు. 'మేం ఎక్కడికి వెళ్లిపోం. సభలోనే ఉంటాం' అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి, ప్రతిపక్ష సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సమయంలో స్పీకర్‌ స్పందించి 'సభలో చర్చ జరిగేలా చూసేందుకు తాళం ఓ సంకేతం' అని తెలిపారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ పరిణామంతో సభలో గందరగోళం ఏర్పడడంతో అసెంబ్లీని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News