Vishal explains how to cured corona: భారత్‌లో కరోనాకేసులు ( Coronavirus ) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తాను కూడా కరోనా బారిన పడి కోలుకున్నానని హీరో విశాల్‌ ( Vishal ) వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా తన తండ్రి జీకే రెడ్డికి కరోనా సోకగా.. తన తండ్రికి సాయం చేస్తున్న క్రమంలో తనకు కూడా కరోనా అటాక్ అయిందని తెలిపాడు. అవే లక్షణాలు తన మేనేజర్‌లో కూడా కనిపించాయని ఇటీవల వెల్లడించాడు. అయితే.. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా గురించి తన అనుభవాన్ని పంచుకోవడంతోపాటు.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మనోధైర్యాన్ని కలిగించేలా ‌ ఓ వీడియో ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన చాలా ట్వీట్లు చేశానని, తన జీవితంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన వీడియోను షేర్‌ చేస్తున్నానని ఈ సందర్భంగా విశాల్‌ ట్విట్టర్‌లో రాశాడు. Also read: Covid-19: హీరో విశాల్‌కు కరోనా



ఈ వీడియోలో విశాల్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయించుకుంటే.. ఫలితాల కోసం టెన్షన్ పడొద్దని, ఒకవేళ పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని సూచించాడు. తన నాన్న గురించి జాగ్రత్తలు తీసుకుంటుంటే తనకు కూడా అవే లక్షణాలు కనిపించాయని.. శరీర ఉష్ణోగ్రత 100-103కి పైగా ఉందని తెలిపాడు. ఆ తర్వాత రోజు దగ్గు, జలుబు వచ్చాయన్నాడు. తన మేనేజర్ హరికి కూడా అవే లక్షణాలు ఉన్నాయని.. తామంతా ఆయుర్వేద మెడిసిన‌ వాడటం వల్ల కేవలం వారం రోజుల్లోనే డేంజ‌ర్ నుంచి బయటపడినట్లు పేర్కొన్నాడు. క్రమ పద్దతిలో మెడిసిన్స్ వాడుతూ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నామని, కేవలం వారం రోజుల్లోనే ఆరోగ్యవంతంగా మారామని వెల్లడించాడు. ఈ సందర్భంగా వారు ఉపయోగించిన మెడిసిన్‌ను సైతం ట్విట్టర్‌లో పంచుకున్నాడు. అయితే ప్రతి ఒకరూ డాక్టర్‌ను సంప్రదించాకే ఈ మెడిసన్‌ను వాడాలని విశాల్‌ సూచించాడు. ఈ వీడియోను చూసిన అభిమానులంతా.. నువ్వు రియల్ హీరో అంటూ విశాల్‌ను ప్రశంసిస్తున్నారు. కరోనా బాధితులకు మనోధైర్యాన్ని కలిగించేలా మంచి పని చేస్తున్నావంటూ విశాల్‌ను అభినందిస్తున్నారు. Also read: Sonu Sood: శారదకు జాబ్ ఆఫర్ లెటర్..