Mumbai on High Alert: ముంబయికి ఉగ్రదాడి ముప్పు- అప్రమత్తమైన పోలీసులు!
Mumbai on High Alert: ముంబయిలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Mumbai on High Alert: ముంబయిలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఖలిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులంతా అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. నగర పోలీసులందరికి వీక్లీ ఆఫ్, ఇతర సెలవులు రద్దు చేసినట్లు ముంబయి పోలీస్ విభాగం పేర్కొంది. శుక్రవారానికి సంబంధించి అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సెలవులో ఉన్న ప్రతి పోలీసూ తక్షణమే విధుల్లో చేరాలని (Mumbai security high alert) ఆదేశించారు పోలీస్ ఉన్నతాధికారులు.
ఉగ్ర దాడి అలర్ట్ మేరకు.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన.. ముంబయి, దాదర్, బాంద్రా, చర్చ్ గేట్, సీఎస్ఎంటీ, కుర్లాల వద్ద భారీగా బలగాలను మోహరించినట్లు ముంబయి రైల్వే కమిషనర్ ఖైజర్ ఖలీద్ (New Year security alert) వెల్లడించారు.
శుక్రవారం మొత్తం 3,000 మంది రైల్వే అధికారులను వేర్వేరు చోట్ల మోహరించనున్నట్లు తెలిపారు ఖలీద్.
ఇప్పటికే 144 సెక్షన్..
ఒమిక్రాన్ వేరియంట్ (Omicorn fears) విజృంభణ భయాలతో మహారాష్ట ప్రభుత్వం ఇప్పటికే ముంబయి నగరంలో 144 సెక్షన్ విధించింది. కొత్త సంవత్సర వేడుకల (New year Eve) నేపథ్యంలో కేసులు పెరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం కూడా విధించింది (Ban on New Year Celebrations) ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలతో పాటు, ఇండోర్‌లోనూ వేడుకలు జరపుకోవద్దని స్పష్టం చేసింది. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెట్లలో వేడుకలకు అనుమతి రద్దు చేసింది. జనవరి 7 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Also read: తస్మాస్ జాగ్రత్త.. నాలుగు డోసులు తీసుకున్న మహిళకు పాజిటివ్! విమానం ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook