తస్మాస్ జాగ్రత్త.. నాలుగు డోసులు తీసుకున్న మహిళకు పాజిటివ్‌! విమానం ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు!!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విమానాశ్రయంలో నాలుగు డోసులు తీసుకున్న ఓ మహిళకు బుధవారం కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 04:00 PM IST
  • నాలుగు డోసులు తీసుకున్న మహిళకు పాజిటివ్‌
  • విమానం ఎక్కకుండా మహిళను అడ్డుకున్న అధికారులు
  • దుబయ్‌ నుంచి 12 రోజుల క్రితమే
తస్మాస్ జాగ్రత్త.. నాలుగు డోసులు తీసుకున్న మహిళకు పాజిటివ్‌! విమానం ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు!!

Woman vaccinated four times tests positive for Coronavirus at Indore Airport: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఇండోర్ విమానాశ్రయం (Indore Airport)లో నాలుగు డోసులు తీసుకున్న ఓ మహిళకు బుధవారం కోవిడ్-19 (Covid 19) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆమెను దుబాయ్ (Dubai) వెళ్లే విమానం ఎక్కకుండా విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమెకు స్వల్ప లక్షణాలు ఉన్నా.. ముందుజాగ్రత్తగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సదరు మహిళకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చింది కాబట్టి ఒమిక్రాన్ టెస్ట్ కోసం ఆమె నమూనాలను పంపించాం అని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భురే సింగ్‌ సెథియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దుబయ్‌ నుంచి 12 రోజుల క్రితమే ఆ మహిళ (Woman) ఇండోర్ (Indore) సమీపంలోని మోవ్ పట్టణానికి వచ్చారు. బంధువుల వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆమెకు జలుబు, దగ్గు వచ్చాయి. ఇక మళ్లీ తిరిగి దుబయ్‌ వెళ్లేందుకు బుధవారం ఎయిర్‌ పోర్టుకు వచ్చారు. అక్కడ జరిపిన సాధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా ఆ మహిళకు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య కాలంలో సినోఫామ్‌, ఫైజర్‌కు చెందిన టీకాలను రెండు డోసుల చొప్పున (4 Times Vaccinated) తీసుకున్నట్లు సదరు మహిళ అధికారులకు చెప్పారు. తనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ని ఎందుకు పెట్టారో చెప్పేసిన రాజమౌళి.. కారణం అభిమానులే అట!!

'ఇతర దేశాల్లో నాలుగు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ 30 ఏళ్ల మహిళ ఇటీవలే దుబాయ్ నుంచి ఇండోర్‌ వచ్చారు. ఇండోర్‌ ఎయిర్‌ పోర్టు నిబంధనల ప్రకారం నిర్వహించే కరోనా పరీక్షలకు ఆమె నమూనాలు ఇచ్చారు. అందులో సదరు మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాలుగు రోజుల క్రితం జలుబు, దగ్గు వచ్చినట్లు ఆ మహిళ తెలిపారు. ప్రస్తుతం ఆమెకు తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం. మెరుగైన వైద్యం అందిస్తున్నాము' అని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భురే సింగ్‌ సెథియా తెలిపారు.

Also Read: Krithi Shetty on Liplock: 'కథ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమే'.. కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్!

మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 7లక్షల 93వేల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అందులో 10,533 మంది మృత్యువాతపడినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా (Coronavirus) కేసులు రోజురోజూకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 13154‬ కేసులు (Covid Cases in India) వెలుగుచూశాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 34822040కి చేరింది. దేశవ్యాప్తంగా 82,402 యాక్టివ్ కేసులు (Active Cases in India) ఉన్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x