Civilians killed in Nagaland: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో (Nagaland) ఉద్రిక్తతలు చెలరేగాయి. మొన్ జిల్లాలోని తిరు గ్రామంలో ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో 13 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. ఆర్మీ జవాన్లు వారిని ఎస్‌సీఎన్ (National Socialist Council of Nagaland) ఉగ్రవాదులుగా భావించి కాల్పులు జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యను నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్మీకి చెందిన పలు వాహనాలకు నిప్పంటించి తగలబెట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్ జిల్లాలోని ఒటింగ్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ మినీ ట్రక్కులో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆర్మీ జవాన్లు (Indian Army) వారిపై కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఇంటి నుంచి పనులకు వెళ్లినవారు ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో కొంతమంది గ్రామస్తులు వారి కోసం గాలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తిరు గ్రామం సమీపంలో వారు హత్యకు గురైనట్లు గుర్తించారు. అనంతరం ఈ హత్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.


నాగాలాండ్ (Nagaland Firing Incident) సీఎం నీఫియు రియో (Neiphiu Rioఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 'ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఘటనపై సిట్ విచారణకు ఆదేశిస్తున్నాం. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ శాంతియుతంగా వ్యవహరించాలి.' అని సీఎం నీఫియు రియో విజ్ఞప్తి చేశారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై (Firing Incident) ట్విట్టర్‌లో స్పందించారు. 'నాగాలాండ్‌లోని ఒటింగ్, మొన్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటన ఆవేదనకు గురిచేస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్‌ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతుంది.' అని పేర్కొన్నారు.


 



Also Read: Terror Attack: మాలిలో ఉగ్ర బీభత్సం-31 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook