Himachal Pradesh: హిమాచల్​ ప్రదేశ్ కొత్త ఘనతను సాధించింది. వయోజనులందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh fully vaccinated) అధికారిక ప్రతినిధి వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 53,86,393 మంది అర్హులైన వయోజనులకు కరోనా రెండు డోసుల టీకా ఇచ్చినట్లు అధికారిక ప్రతినిధి (Fully vaccinated state in India) తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులోని 100 శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్​ను సాధించింది హిమాచల్ ప్రదేశ్​.


ఆరోగ్య కార్తకర్తలకు గుర్తింపు..


పూర్తి వ్యాక్సినేషన్​ను సాధించినందుకు గానూ.. ఆరోగ్య సిబ్బంది గౌరవార్థం బిలాస్​పూర్​లోని ఆల్​ ఇండియా ఇన్ట్సీట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​ (ఎయిమ్స్​) ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.


ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్​ ఠాకూర్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు మన్సుఖ్​ మాండవీయా, అనురాగ్ ఠాకూర్​ హాజరవనున్నారు. ఇందులో కొవిడ్ కాలంలో పని చేసిన ఆరోగ్య శాఖ సిబ్బందికి.. ప్రత్యేక సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు.


ఇక శనివారం హిమాచల్ ప్రదేశ్​లో కొత్తగా 78 కరోనా కేసులు, సున్నా మరణాలు నమోదయ్యాయి.


రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,835 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 75 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో రికవరీల సంఖ్య 2,22,831కి చేరింది.


Also read: Omicron: ఢిల్లీలో ఫస్ట్ ఒమిక్రాన్ కేసు-దేశంలో ఐదుకి చేరిన కొత్త వేరియంట్ కేసులు


Also read: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ రికార్డు, భారీగా ప్లేస్‌మెంట్స్, 2 కోట్లకు పైగా వేతన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook