Trekking Tragedy: హిమాచల్‌ప్రదేశ్ ట్రెక్కింగ్ విషాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య
Trekking Tragedy: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్వతారోహణకై వెళ్లినవారు మృత్యువాత పడ్డారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గల్లంతయ్యారు.
Trekking Tragedy: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్వతారోహణకై వెళ్లినవారు మృత్యువాత పడ్డారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గల్లంతయ్యారు.
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రతియేటా ట్రెక్కింగ్‌కు(Trekking)అత్యధికంగా పర్యాటకులు లేదా పర్వతారోహకులు వస్తుంటారు. వాతావరణం అనుకూలంగా ఉంటే ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో..ప్రతికూలిస్తే అన్ని అనర్ధాలుంటాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అదే జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లిన కొంతమంది గల్లంతయ్యారు. ఇందులో 11 మంది (11 Dead in Trekking)మరణించినట్టు తేలింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయినవారిని కనిపెట్టేందుకు హెలీకాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకు చెందిన 8 మంది పర్వతారోహకులతో పాటు ముగ్గురు వంటగాళ్లు ట్రెక్కింగ్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌కు(Himachal pradesh)వెళ్లారు.11వ తేదీన ఉత్తర కాశి జిల్లాలోని హార్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. అక్కడ వాతావరణం ప్రతికూలంగా మారడంతో గల్లంతయ్యారు. ఇందులో ఐదుగురి మృతదేహాల్ని మూడ్రోజుల క్రితం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాల్తో రక్షించారు. ఇటీవల మరో రెండు మృతదేహాల్ని కనిపెట్టారు. గల్లంతైన మిగిలినవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ట్రెక్కింగ్ చేయకూడదని తెలిసినా..అత్యుత్సాహంతో ముందుకెళ్లడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
Also read: NEET PG 2021 Admissions: పీజీ నీట్ 2021 అడ్మిషన్లకై కౌన్సిలింగ్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook