రక్తంతో హాలీ ఆడుతున్నారు.. : అధీర్ రంజన్ చౌదరి
లోక సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సిబ్బందిని గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడి
న్యూఢిల్లీ: లోక సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సిబ్బందిని గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడి చేశారని తెలిపారు.
సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ నేత అధీర్ రంజాన్ చౌదరి నివాసానికి ప్రక్కనే ఉన్న కార్యాలయంలోకి నలుగురు వ్యక్తులు చొరబడి సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. అధీర్ రంజన్ చౌదరి ప్రైవేట్ కార్యదర్శి ప్రదీప్టో రాజ్‌పండిట్ ఫిర్యాదు చేయగా, దుండగులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారని దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పార్లమెంటులో వెంటనే చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. హోలీ పండగ తరువాత సభలో చర్చ జరుగుతుందని అన్నారు. కాగా అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చర్చ నుండి ప్రభుత్వం పారిపోతోందని, అంతలా ఎందుకు భయపడుతున్నారని అన్నారు. కాగా హాలీ గూర్చి మీరా మాట్లాడేది, ఢిల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారని అధీర్ రంజన్ చౌదరి ఘాటైన విమర్శలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..