యాక్టివా 125, గ్రాజియా, ఎవియేటర్ స్కూటర్లలో ఫ్రంట్ ఫోర్క్ వద్ద బిగించిన బోల్టులో లోపం ఉన్నట్లు గుర్తించిన హోండా సంస్థ వాటిని రీకాల్ చేసింది. వెనక్కి పిలిపించిన అనంతరం వాటిని పరిశీలించి అవసరమైతే బోల్టును మారుస్తామని తెలిపింది. హోండా డీలర్లు ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పి స్కూటర్లను వెనక్కి తెప్పించనున్నారు. బోల్టు బిగింపు సందర్భంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయమని హోండా కంపెనీ స్పష్టం చేసింది. యాక్టివా 125, గ్రాజియా, ఏవియేటర్‌ మోడళ్లకు సంబంధించిన 56,194 యూనిట్లను రీకాల్‌ చేయనున్నారు. త్వరలో డీలర్స్‌ సదరు వినియోగదారులకు ఈ సమాచారం అందించనున్నారు.


యాక్టివా 125 మోడల్‌ స్కూటర్‌ను చాలా ఏళ్ల క్రితమే విడుదల చేయగా.. గ్రాజియాను 2017లో విడుదల చేశారు. వినియోగదారులు ఈ మోడల్‌‌కు ఆకర్షితులయ్యారు. యాక్టివా125 ధర రూ.57,633 (ఢిల్లీ ఎక్స్‌ షోరూం) కాగా గ్రాజియా రూ.58,133గా.. ఏవియేటర్‌ మోడల్‌ ధర రూ.52,796గా ఉంది.