Road Accident: సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...కుటుంబం దుర్మరణం
మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
Horrific Road Accident: మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(Horrific Road Accident)సంభవించింది. సత్నా జిల్లా మైహర్ ఠాణా పరిధిలోని జీత్నగర్ వద్ద ఓ కారు(Car)ను వేగంగా వచ్చిన ఓ ట్రక్కు(Truck) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్ని సత్యం ఉపాధ్యాయ్(40), మనికా ఉపాధ్యాయ్(35), ఇషానీ ఉపాధ్యాయ్(10), స్నేహ్ ఉపాధ్యాయ్‌గా (8) గుర్తించారు.
Also read: Truck: పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురి మృతి (వీడియో)
బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం (Road accident) జరిగినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు, వారి కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొనఊపిరితో ఉన్న కుమారుడిని స్థానికులు సత్నా జిల్లా ఆస్పత్రి(Satna District hospital)కి తరలించారు. అయితే.. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడం వల్ల పిల్లాడికి వైద్యం అందలేదు. 3 గంటల సేపు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. బాలుడు చనిపోయాడని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మైహర్ రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook