Truck: పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురి మృతి (వీడియో)

Truck Rams Into Marriage Procession, 3 Killed In Malkangiri : బియ్యం బస్తాల లోడ్‌తో వస్తోన్న లారీ గ్రామ సర్పంచ్‌ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 12:07 PM IST
  • ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి సమీపంలో విషాదం
    పెళ్లి వేడుకపైకి దూసుకెళ్లిన మృత్యువాహనం
  • ఈ ఘటనలో పెళ్లి కొడుకు తండ్రితో పాటు ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
  • ఐదుగురికి తీవ్ర గాయలు
Truck: పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురి మృతి (వీడియో)

Truck drives into wedding procession in Odisha’s Malkangiri, 3 killed: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి (Malkangiri) సమీపంలోని పండ్రీపణి గ్రామంలో (Pandripani village) విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకపైకి ఓ మృత్యువాహనం దూసుకెళ్లింది. బియ్యం బస్తాల లోడ్‌తో వస్తోన్న లారీ గ్రామ సర్పంచ్‌ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. 

పండ్రీపణి గ్రామ సర్పంచ్‌ (Sarpanch of Pandripani) శివఖేముండు తన కుమరుడి వివాహం భయపరగూడలో నిర్వహించారు. తర్వాత స్వగ్రామనికి ఊరేగింపుగా తీసుకు వస్తున్నారు. ఆ సమయంలో అటు వస్తోన్న మల్కన్‌గిరి వైపు వస్తోన్న ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఆ లారీ (truck) ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత పెళ్లి ఉరేగింపు (Baarat) బృందంపైకి దూసుకెళ్లింది.

Also Read : UP: కటింగ్ చేయలేదని బార్బర్​ను కాల్చి చంపాడు

ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి (groom’s father ), పండ్రీపణి గ్రామ సర్పంచ్‌ శివఖేముండు (Shiba Khemudu), పెళ్లి కుమారుడి మేనమామ సంతోష్‌కుమార్‌ సాహు (Santosh Kumar Sahu), సునబేడకు చెందిన డప్పు వాయిద్యకారులు రాజకుమార్‌ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పండ్రీపణి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లారీని (lorry) అడ్డుకొన్నారు. మల్కన్‌గిరి, జయపురం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపి వేసి నిరసన వ్యక్తం చేశారు.

Also Read : Tomato prices: ప్రభుత్వం చొరవతో అక్కడ కిలో టమాటా ధర రూ.85-100..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

More Stories

Trending News