Sputnik v vaccine: స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఈ వ్యాక్సిన్‌తో
Sputnik v vaccine: దేశంలో మరో వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు తోడుగా ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. అసలు ఈ స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు, ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటాయన్న వివరాలు చూద్దాం.
Sputnik v vaccine: దేశంలో మరో వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు తోడుగా ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. అసలు ఈ స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు, ఎలా పనిచేస్తుంది,సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటాయన్న వివరాలు చూద్దాం.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్(Sputnik v vaccine)ను రష్యాకు చెందిన గమేలియా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. కరోనా తొలివేవ్ సమయంలోనే అంటే గతేడాది ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్ రష్యాలో రిజిస్టరైంది. మన దేశంలో రెడ్డీస్ ల్యాబ్స్(Dr reddys labs) ఫార్మా సంస్థ ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. రెడ్డీస్ ల్యాబ్స్‌తోపాటు హెటిరో, పనాసీ బయోటెక్, గ్లాండ్, స్టెలిస్, విర్కో ఫార్మా కంపెనీలు దేశంలో ఏడాదికి 85 కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నాయి.
మనకు సాధారణంగా జలుబును కలిగించే రెండు రకాల అడెనో వైరస్‌లను తీసుకుని బలహీనపర్చి..వాటికి కరోనా వైరస్ స్పైక్స్‌లో ఉండే ప్రొటీన్‌ను జోడించి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ అడెనోవైరస్‌లు కావడంతో శరీరం, రోగ నిరోధక వ్యవస్థ( Immunity system) అతిగా రెస్పాండ్ కాకుండా..తగిన యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి.ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్ (Pfizer vaccine) 95.3 శాతం, మోడెర్నా(Moderna vaccine) 94.1శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆ తరువాత కోవిడ్ వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నది స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కే.ఈ వ్యాక్సిన్ సామర్ధ్యం 91.6 శాతంగా నిర్ధారించారు.
స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అర మిల్లీలీటర్ డోసు చొప్పున 21 రోజుల తేడాతో రెండు డోసులు వేసుకోవల్సి ఉంటుంది. రెండో డోసు కూడా వేసుకున్నాక శరీరంలో యాంటీబాడీస్( Anti Bodies) ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్‌తో 28వ రోజు నుంచి 42వ రోజు మధ్య గరిష్టంగా ఇమ్యూనిటీ ఉంటుందని గుర్తించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండు డోసులు కూడా రెండు వేర్వేరు స్ట్రెయిన్లతో ఉంటాయి. మొదటి డోసులో ఒక రకం, రెండో డోసులో మరో రకం అడెనోవైరస్‌తో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇస్తారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ రెండు సార్లు క్రియాశీలమవుతుంది.యాంటీ బాడీస్ ఎక్కువ కాలం ఉండి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
Also read: NEET PG 2021 exam వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థుల డిమాండ్.. ట్విటర్‌లో Postponeneetpg ట్రెండింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook