How To Check PM Kisan 10th Installment Status Online Step by step guide full details here : ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ (Pradhan Mantri Kisan Samman Nidhi) కింద పదో విడత నగదు రైతుల ఖాతాల్లోకి జమ అయింది. సుమారు 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 20,000 కోట్లకు పైగా నగదును జమ చేసింది కేంద్రం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు కేంద్రం ఇస్తోంది. నాలుగు నెలల వాయిదాలలో 2,000 రూపాయల చొప్పున కేంద్రం అన్నదాతలకు చెల్లిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులకు (farmers) ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. 


ఇక ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ (Pradhan Mantri Kisan Samman Nidhi) కింద రిలీజైన 10వ విడత నగదు ఖాతాలో పడిందో లేదో అనే విషయం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. నగదు జమ కాగానే ఎస్ఎమ్ఎస్‌లు వస్తాయి. ఒకవేళ రాకుండా ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేస్తే సరి. 


పీఏం కిసాన్ సమ్మాన్ నిధి నగదు జమ స్టేటస్‌ను (Status) ఇలా చెక్ చేసుకోవచ్చు. పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అఫీషియల్ వెబ్‌సైట్ (pmkisan.gov.in) కు వెళ్లి.. మెనూ బార్‌‌లో ఉన్న "ఫార్మర్స్ కార్నర్" (Farmers Corner) పై క్లిక్ చేయాలి.


తర్వాత బెనెఫిషరీష్ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మరో విండో వస్తుంది. అందులో మీ రాష్ట్రం, జిల్లా/సబ్ జిల్లా, బ్లాక్, గ్రామ (State, District/Sub-District, Block, Village) వివరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత గెట్ రిపోర్ట్ పై (Get Report) క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్‌పై లబ్ధిదారుల మొత్తం జాబితా ( Beneficiaries Total list) కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.


Antigen Test Kit Procedure: కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోండిలా!  


ఆ తర్వాత మళ్లీ హోమ్‌పేజీకి తిరిగి వెళ్లండి. ఇప్పడు బెనిఫిషియరీ స్టేటస్ బటన్‌పై క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ సంఖ్య లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌‌ను ఎంచుకోండి. ఆధార్ నంబర్ (Aadhaar number) లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేశాక "గెట్ డేటా" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్ మీకు నగదు జమ అయ్యిందో లేదో చూపిస్తుంది. ఒక వేళ మీ ఖాతాలో నగదు జమ కాకపోతే స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ (PM Kisan) హెల్ప్‌ లైన్ నంబర్ 011 - 24300606కు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.


Also Read : సైనా నెహ్వాల్‌ గురించి అలానేనా మాట్లాడేది.. సిద్ధార్థ్ అకౌంట్‌ను బ్లాక్ చేయండి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.