ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టిక్ టాక్ యాప్ ( TikTok Data ) ను నిషేధం టిక్ టాక్ ప్రేమికుల్ని షాక్ కు గురి చేసింది. చైనా యాప్ ను నిషేధించడం మంచిదే అనే అభిప్రాయంలో ఉన్నా సరే...తమ విలువైన డేటా పరిస్థితి ఏంటనే ఆందోళన పట్టుకుంది అందరికీ. అయితే  మీ డేటా గురించి ఏ మాత్రం ఆందోళన చెందవద్దిక. ఇలా చేస్తే భద్రంగా డేాటాను డౌన్ లోడ్ ( Download Tiktok Data )  చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చైనాతో ( China Dispute ) నెలకొన్న సరిహద్దు వివాదం నేపధ్యంలో చైనా వస్తువుల్ని పూర్తిగా బహిష్కరించాలన్న డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా మన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన ఆ దేశపు యాప్ లపై ఆ ప్రభావం ఎక్కువగానే పడింది. చైనాకు చెందిన మొత్తం 59 యాప్ లను ( China Apps ) ఇండియా బ్యాన్ ( India Ban on china apps ) చేయడం దీనికి కారణం. ఇందులో టిక్ టాక్ గురించి ప్రముఖంగా చెప్పుకోవల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 27.76 కోట్ల మంది టిక్ టాక్ ( Tiktok users ) వినియోగిస్తుంటే...ఒక్క భారత్ లోనే 11.9 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. గత ఏడాది ఐఫోన్లలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన యాప్ లలో టిక్ టాక్ నాలుగో స్థానంలో ఉందంటే అతిశయోక్తి కానేకాదు. Also read: TikTok app: టిక్ టాక్‌ను రీప్లేస్ చేసే యాప్ రాబోతోందా ?


ఇప్పుడీ యాప్ ను  హఠాత్తుగా బ్యాన్ చేయడంతో  టిక్ టాక్ ప్రేమికులకు గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా టిక్ టాక్ ఆధారంగా స్టార్ లుగా మారినవారెందరో ఉన్నారు. తమ క్రియేటివిటీను జోడించి రకరకాల వీడియోలు చేసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేసున్నారు. టిక్ టాక్ నిషేధం గురించి బెంగ కంటే...తమ విలువైన డేటా ఏమవుతుందనే ఆందోళనే ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడిక ఆ బెంగ వద్దు. ఇలా చేస్తే మీ  విలువైన డేటాను భద్రంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Also read: ప్రాణం తీసిన tiktok పాపులారిటీ..


టిక్ టాక్ పై నిషేధం  నేపధ్యంలో గూగుల్ ప్లే స్టోర్ ( Google play store ) , యాపిల్ యాప్ స్టోర్ ( Apple App Store )  లో టిక్ టాక్ యాప్ ఇప్పుడు కన్పించడం లేదు. ఇప్పటికే టిక్ టాక్ ఇన్ స్టాల్ చేసుకున్నవారు తమ తమ ప్రొఫైల్ డేటాను, వీడియోల్ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశముంది. 


వీడియో డౌన్ లోడ్ కోసం ( To Download video ) :


1. టిక్ టాక్ యాప్ ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ లోకి వెళ్లాలి


2. మీకు కావల్సిన  వీడియోలపై క్లిక్ చేయాలి.


3. పక్కన మీకు స్క్రీన్ పై కన్పించే మూడు చుక్కల్ని ( Three dots ) ను ప్రెస్ చేసి సేవ్ చేయండి అంతే.


Also read: Indian Railways: ఇది రైలు కాదు..సూపర్ అనకొండ


ప్రొఫైల్ డేటా కోసం ( For Profile Data ) :


1. టిక్ టాక్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున్న మూడు చుక్కల్ని ( Three Dots )  ప్రెస్ చేయాలి


2. ప్రైవసీ, సేఫ్టీ ఆప్షన్ లో వెళ్లి,,,డేటా పర్సనలైజేషన్ ను ఎంచుకోవాలి. తరువాత డేటా డౌన్ లోడ్ పై క్లిక్ చేయండి చాలు.


3. మీ రిక్వెస్ట్ టిక్ టాక్ కు వెళ్తుంది..30 రోజుల్లోగా సంబంధిత సమాచారం మీ యాప్ కు చేరుతుంది.


4. ఇలా చేరిన సమాచారాన్ని నాలుగురోజుల్లోగా డౌన్ లోడ్ చేసుకోవాలి. లేకపోతే అది కాస్తా ఎక్స్ పైర్ అవుతుంది.


5. మీరు పంపిన రిక్వెస్ట్ ఆమోదం పొందితేనే డేటాను తిరిగి పొందగలరు


ఇంకెందుకు ఆలస్యం..వెంటనే మీ టిక్ టాక్ యాప్ లో ఉన్న మీ విలువైన వీడియోల్ని , డేటాను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి.