FASTag: ఫాస్టాగ్. నేషనల్ హైవేస్ దాటాలంటే ఇది తప్పని సరి ఇప్పుడు. టోల్‌ప్లాజా దాటాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే. అయితే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉచితంగానే అందించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI) ఫాస్టాగ్ విషయంలో గుడ్‌న్యూస్ అందించింది. మీకు వాహనం ఉంటే ఇకపై మీరు ఫాస్టాగ్ ఉచితంగానే తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్‌ప్లాజాలలో స్టేట్ ప్లాజా అయినా సరే...ఉచితంగానే ఫాస్టాగ్ (FASTag) పొందవచ్చని ఎన్‌హెచ్‌ఏ‌ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ( Central government)తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు వంద రూపాయలు ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల ఫాస్టాగ్ వినియోగాన్ని పెంచేలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మార్చ్ 1 వరకు మాత్రమే ఈ అవకాశముంది. మీరు ఒకవేళ ఫాస్టాగ్ తీసుకోకపోతే సమీపంలోని టోల్‌ప్లాజా ( Tollplaza)కు వెళ్లి తీసుకోండిక.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87 శాతం మంది వినియోగదారులు ఫాస్టాగ్ వాడుతున్నారు. కేవలం రెండ్రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగిపోయింది. ఇక దేశంలో వంద టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వినియోగించేవారి సంఖ్య 90 శాతానికి చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో కలుపుకుని వంద కోట్ల టోల్ వసూలైంది. ఉచితంగా ఫాస్టాగ్ ఇవ్వాలనే నిర్ణయంతో పాటు మరో గుడ్‌న్యూస్ కూడా అందిస్తోంది ఎన్‌హెచ్‌ఏ‌ఐ.  టోల్‌ప్లాజా వద్ద ఏదైనా సాంకేతిక లోపముంటే ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంతవరకూ ఒక్కపైసా కూడా చెల్లించకుండానే  వినియోగదారులు టోల్ ప్లాజా  ( No need to pay at tollplaza )దాటవచ్చని ఎన్‌హెచ్‌ఏ‌ఐ అధికారులు తెలిపారు. గత రెండ్రోజుల్లో 2.5 లక్షలకు పైగా ఫాస్టాగ్(FASTag)అమ్మకాలు జరిగాయి. 


ప్రస్తుతం, ఫాస్టాగ్‌ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100 టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ వినియోగించే ( FASTag users) వారి సంఖ్య 90శాతం చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్ వసూలు చేశారు. టోల్‌ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వినియోగదారులు టోల్‌ప్లాజాలు దాటవచ్చు అని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ (FASTag )తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది.


Also read: Puducherry government crisis: మరో ఇద్దరి రాజీనామా, బలపరీక్షకు ముందే సీఎం రాజీనామా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - 
https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook