Puducherry government crisis: పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బలపరీక్షకు ముందే ప్రభుత్వం పడిపోయేలా కన్పిస్తోంది. మరో ఇద్దరి రాజీనామాతో పరిస్థితి వికటించింది. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
పుదుచ్చేరిలో ప్రభుత్వం సంక్షోభంలో( Puducherry government crisis )పడిపోయింది. 30 మంది శాసనసభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో 16 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ముఖ్యమంత్రిగా నారాయణస్వామి ఉన్నారు. అయితే ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడటం, ఐదుగురు ఎమ్మేల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. అదే సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ( Puducherry Leutenant governor kiran bedi )ని తప్పించి తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వానికి మెజార్టీ లేకపోవడం, సంక్షోభంలో పడటంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన బలపరీక్షకు సిద్ధం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో సమావేశమై సభ్యులు చేతులెత్తి మద్దతు ప్రకటించాలని కోరారు.
ఈలోగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి ( Puducherry cm narayana swamy )పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు పెరిగాయి. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో డీఎంకే ఎమ్మెల్యే స్పీకర్‌కు రాజీనామా లేఖల్ని పంపారు. బలపరీక్షకు ముందే ఇద్దరు రాజీనామా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వ బలం 9కు పడిపోయింది. ఇక ఇప్పుడు ప్రతిపక్షమైన ఎన్ఆర్ కాంగ్రెస్‌కు 7 మంది సభ్యులు, అన్నాడీఎంకేకు నలుగురు సభ్యులు, నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు కలుపుకుంటే మొత్తం 14 మంది సభ్యులున్నారు. ఇక ప్రభుత్వం మెజార్జీ నిరూపించుకునే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. దాంతో బలపరీక్ష ( Floor test )కు ముందే ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
Also read: Tamilnadu: పన్నీర్ సెల్వం వస్తే...ఆహ్వానించేందుకు సిద్ధమేనంటున్న శశికళ వర్గం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook