India post payments bank: పోస్టాఫీసులు బ్యాంకులుగా సేవలందిస్తున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్‌గా మారుతున్నాయి. మొన్నటి వరకూ ఉత్తరాలకే పరిమితమైన పోస్ట్ ఆపీసులు ఇప్పుడు బ్యాంకింగ్ సేవల్లో నిమగ్నమవుతున్నాయి. మరి అందులో ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..లాభాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ( India post payments bank )ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందుబాటులో తీసుకొస్తూ బ్యాంకులకు దీటుగా వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు పోస్టాఫీసుల్లో ఉత్తరాల కంటే ఎక్కువగా బ్యాంకింగ్ సేవలే కన్పిస్తాయి. తాజాగా ఇండియన్ పోస్టల్ బ్యాంకు మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త యూజర్లకు అందుబాటులో తీసుకొనివచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు కొత్తగా మొబైల్ అప్లికేషన్ డిజిటల్ పొదుపు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని కొత్త యూజర్లకు అందిస్తోంది. ఇంతకు ముందైతే పోస్టాఫీసు ( Post Office )లో ఖాతా తెరిచేందుకు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. ఐపీపీబీ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే ఖాతా తెరవవచ్చు. అదే విధంగా యాప్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్, డబ్బుల్ని బదిలీ చేసుకోవడంతో పాటు లావాదేవీల్ని పూర్తి చేసుకోవచ్చు. 


ఐపీపీబీలో పోస్టాఫీసు ఖాతా తెరిచే విధానం


దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండి భారతీయుడై ఉండాలి, మొబైల్ ఫోన్‌లోని ఐపీపీబి ( IPPB )మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఓపెన్ అక్కౌంట్‌పై క్లిక్ చేయాలి. తరువాత పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి..విద్యార్ఙతలు, చిరునామా, నామినీ వివరాల్ని సమర్పించాలి. అంతా పూర్తయితే డిజిటల్ ఖాతా ఓపెనవుతుంది. డిజిటల్ ఖాతా ఒక యేడాది పాటు మాత్రమే చెల్లుతుంది. ఖాతా తెరిచిన ఏడాదిలోగా సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తే..కొనసాగుతుంది. 


Also read: Isro maps: గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా స్వదేశీ ఇస్రో మ్యాప్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook