Railway Ticket: రైల్వే ప్రయాణం ఎప్పుడైనా రద్దయినప్పుడు టికెట్ రద్దు చేసుకోకుండా మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. మీ రైల్వే టికెట్‌ను మరొకరి పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వేల్లో అధికారికంగా ఒకరి టికెట్‌పై మరొకరు ప్రయాణించడమనేది నేరం. కానీ అదే అధికారికంగా మన టికెట్‌ను మరొకరి పేరుమీద బదిలీ కూడా చేసుకోవచ్చు. ఏదో అనివార్య కారణాల వల్ల మనం ప్రయాణించలేకపోతున్నా..లేదా ప్రయాణం రద్దయినా టికెట్ రద్దు చేసుకోవల్సి వస్తుంది. అదే ఆ టికెట్‌ను మీ బంధువుల పేరుమీద బదిలీ చేసుకునే అవకాశం ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. రిజర్వేషన్ టికెట్ (Reservation Ticket)ఉండి..ప్రయాణం చేయలేని పరిస్థితులున్నప్పుడు మీ టికెట్ మరో వ్యక్తి పేరుమీద ఇలా బదిలీ చేసుకోవాలి.


అయితే కుటుంబంలోని తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్య పేర్ల మీద మీ టికెట్ బదిలీ చేసుకోవచ్చు.టికెట్ బదిలీ కోసం రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఓ దరఖాస్తు పెట్టుకోవాలి. తరువాత టికెట్‌పై ఉన్న పేరు తొలగించి మీరు సూచించిన మరో పేరుకు బదిలీ జరుగుతుంది. ఒకసారి మాత్రమే టికెట్ బదిలీ అనేది జరుగుతుంది.ముందుగా రైల్వే టికెట్ తీసుకుని సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. మీ ఆధార్ (Aadhaar)లేదా ఓటర్ ఐడీ గుర్తింపు చూపించాల్సి ఉంటుంది.ఎవరి పేరుమీద బదిలీ చేస్తున్నారో వారి గుర్తింపు ఐడీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి.టికెట్ బదిలీ చేయాలనుకునే వ్యక్తి స్టేషన్ మేనేజర్ లేదా ఛీప్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌ని సంప్రదించి ఈ పని చేసుకోవల్సి ఉంటుంది. బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి రేషన్ కార్డు, ఓటరు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటివాటిలో ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని తెలిపే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 


Also read: EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త, మార్చ్ 2022 వరకూ అవకాశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook