EPFO: PFను సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి
ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా అతిపెద్ద పొదుపు వనరు. భవిష్యత్ అవసరాల కోసం ఈ ఖాతాలో ఉద్యోగుల నగదు జమ అవుతుంది. సాధారణంగా చాలామంది ఈపీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు భయపడతారు.
EPFO Balance withdrawal: న్యూఢిల్లీ: ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఖాతా అతిపెద్ద పొదుపు వనరు. భవిష్యత్ అవసరాల కోసం ఈ ఖాతాలో ఉద్యోగుల నగదు జమ అవుతుంది. సాధారణంగా చాలామంది ఈపీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు భయపడతారు. ఎందుకంటే నగదు కోసం ఎలాంటి పత్రాలు అవసరమో, దానికోసం ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో, ఎంత మొత్తంలో నగదు వస్తుందో అన్న సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అయితే.. ఈపీఎఫ్ నగదును చాలా తేలికగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకొనవచ్చునో ఇప్పుడు తెలుసుకోండి. Also read: Employer PF Contribution: జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది?
ఈ ప్రూఫ్‌లు ఇస్తే చాలు..
పీఎఫ్ నగదు విత్‌డ్రా కోసం దరఖాస్తు చేసేటప్పుడు.. ఖాతాదారుడి క్లెయిమ్ ఫారం, రెండు రెవెన్యూ స్టాంపులు, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, తండ్రి పేరు, పుట్టిన తేదీకి సంబంధించిన ప్రూఫ్‌లే ఇవ్వాల్సి ఉంటుంది. Also read: గుడ్ న్యూస్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సరికొత్త సదుపాయం
ఈ సందర్భాల్లో ఈపీఎఫ్ మొత్తాన్ని తీసుకోవచ్చు..
అనారోగ్యం బారిన పడినప్పుడు..
ఈపీఎఫ్ ఖాతాదారుడు లేదా ఆయన కుటుంబానికి చికిత్స కోసం ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆసుపత్రిలో ఒక నెల, లేదా అంతకన్నా ఎక్కువకాలం నుంచి భర్తీ అయినట్లు రుజువు చూపించాలి.
ఎడ్యుకేషన్ కోసం..
విద్య కోసం నగదు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే సంస్థ తరుపున ఫారం 31 కింద దరఖాస్తు చేసుకోవాలి. అయితే 50 శాతం నగదు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశముంటుంది.
నిరుద్యోగ పరిస్థితుల్లో..
ఖాతాదారులు నిరుద్యోగులుగా మారితే.. వారు ఒకనెల తరువాత 75%నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని కూడా మరో నెల తరువాత ఉపసంహరించుకోవచ్చు. అయితే.. వైద్య ఖర్చుల కోసం విత్‌డ్రా చేసుకోవాల్సి వస్తే మొత్తంలో కొంత భాగాన్ని లేదా నెలవారీ జీతానికి ఆరు రెట్లు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశముంది.
గృహ రుణం విషయంలో...
గృహరుణం చెల్లింపుల విషయంలో మొత్తం డిపాజిట్‌లో 90 శాతం విత్‌డ్రా చేసుకోవడానికి ఖాతాదారులకు మినహాయింపు ఉంది. అయితే వివాహానికి ఈ పరిమితి 50శాతం మాత్రమే ఉంది. రిటైర్‌మెంట్ సమయంలో మొత్తం నగదును ఉపసంహరించుకోవచ్చు.
ప్రీ- రిటైర్‌మెంట్..
పదవీ విరమణ కంటే.. ముందుగానే ప్రీ రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకుంటే.. దీని కోసం మీ వయస్సు 54 ఏళ్లు ఉండాలి. అప్పుడు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 90 శాతం వరకు ఒక్కసారిగానే విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. Also read: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ECRతో ప్రయోజనం