పెట్రోల్ బంక్ వ‌ద్ద మొబైల్ ఫోన్ ఉప‌యోగించకూడ‌ద‌ని ఎంత‌గా చెప్పినా మనలో చాలా మంది పట్టించుకోరు. దీనికి సంబంధించిన నోటీసులు చూసి కూడా సగటు వ్యక్తులు దీన్ని బేఖాతరు చేస్తూ తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ వ్యక్తి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. టైం బాగుండి బతికి బయటపడ్డారు కానీ.. ప్రమాద తీవ్రత ఎక్కువైతే దాని నష్టం చాలా ఎక్కువగా ఉండేది. పెట్రోల్ బంక్ వ‌ద్ద మొబైల్ ఫోన్ మాట్లాడితే ఏమవుతుందో తెలుసుకోవాలంటే.. హైద‌రాబాద్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టిన వీడియో చూడండి.. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


తస్మాత్ జాగ్రత్త !


మీరు చూస్తున్నది హైదరాబాద్‌లోని  పెంట్రో బంక్..అందులో ఓ ద్విచక్ర వాహనదారుడు త‌న కుమారుడితో క‌లిసి పెట్రోల్ బంకుకి వ‌చ్చి పెట్రోల్ పోయించుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో సెల్ ఫోన్ మ్రోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పెట్రోల్ ఫిల్ చేయిస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్‌కి నిప్పు అంటుకుంది. ఆ బైకుపై కూర్చున్న చిన్నారి కాలికి కూడా మంట‌లు అంటుకున్న ఘటన చూశారుగా...మనం చేసే ఓ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం సంభవించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడండి ప్లీజ్.


ఫోన్ తో ప్రమాదం ఎలాగంటే


సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ హైఎనర్జీని క్యారీ చేస్తాయి. చిన్న రాపిడికి కూడా స్పందించగల పెట్రోల్‌ను సెల్‌ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదు. దీనివ‌ల్ల మంటలు చెల‌రేగే ప్రమాదం ఉంది.


పోలీసుల హెచ్చరిక


ఈ ఘ‌ట‌న ఎక్కడ జరిగిందనే విషయం పోలీసులు వెల్లడించలేదు.పెట్రోల్ బంక్ వద్దకు వ‌చ్చిన‌ప్పుడు మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండాలని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.