Hyderabad tourist car rushed into kerala stream: టెక్నాలజీ ఒక రేంజ్ లో అప్ డేట్ అయిపోయింది. ఒకప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ఆ ప్రదేశం గురించి అందరిని ఆరాతీసేవారు.  ఎలా వెళ్లాలో అనే దానిపై ఎంక్వైరీలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్న కూడా జనాలు గూగుల్ లో మ్యాప్ లు పెట్టుకుని ఈజీగా వెళ్లిపోతున్నారు. దీంతో ఎవరికి అడగాల్సిన పనిలేకుండా సింపుల్గా కొత్త ప్రదేశాలను చుట్టి వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గూగుల్ మ్యాప్ చాలా వరకు కరెక్ట్ గానే లోకేషన్లకు తీసుకెళ్తుంది. కానీ కొన్నిసందర్బాలలో మాత్రం గూగుల్ మ్యాప్ తప్పుడు రూట్ లను చూపించిన ఘటనలు లేకపోలేదు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Pawan Kalyan: ఎన్నికల తర్వాత జనసేనాని మౌనం.. దీని వెనుక మతలబు అదేనా..?


పూర్తి వివరాలు.. 


కేరళకు వెళ్లిన హైదరాబాద్ టూరిస్టులకు అనుకొని ఘటన ఎదురైంది. హైదరాబాద్ నుంచి నలుగురు ఒక వెహికిల్ లో కేరళకు టూర్ కు వెళ్లారు. అక్కడి ప్రాంతాలను ఏంచక్కా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త ప్రదేశాలు కావడంతో గూగుల్ రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు. అప్పటికే కొన్ని ప్రదేశాలను చుట్టేశారు. ఈ నేపథ్యంలో.. కొట్టాయం జిల్లాకు చేరుకున్నారు.  ఈరోజు శనివారం తెల్లవారు జామున కుమర కోమ్ నుంచి అలప్పుజకు స్టార్ట్ అయ్యారు. గూగుల్ మ్యాప్ చూపించినట్లు వెళ్తున్నారు. కొట్టాయంకు చేరుకొగానే కారు నేరుగా ఒక పెద్ద వాగులోకి దూసుకెళ్లింది. తెల్లవారు జామున కావడంతో, వెహికిల్ స్పీడ్ గా ఉండటం, నిద్రమత్తులో ఉండటం వల్ల , ముందు వాగు ఉండటంను గమనించలేరని తెలుస్తోంది.


కారు నేరుగా వాగులోకి దూసుకుపోయింది. దీంతో అక్కడున్న స్థానికులు అలర్ట్ అయి.. ఒక మహిళతో పాటు, కారులో ఉన్న మరో ముగ్గురిని కాపాడినట్లు తెలుస్తోంది. కానీ కారు పూర్తిగా వాగులో పడి మునిగిపోయినట్లు గుర్తించారు. ఇక మరోవైపు  స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ  చేపట్టారు. ఈ ఘటన పట్ల యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి రెస్పాండ్ కాకుంటే తమ పరిస్థితి ఏంటని కూడా ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. ఇద్దరు యువ డాక్టర్లు కారులో గూగుల్ మ్యాప్ ఉపయోగించి నదిలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో వారిద్దరూ జల సమాధి అయిన ఘటన తెలిసిందే.  గూగుల్ మ్యాప్ ను ఉపయోగించుకునే వారు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచించారు. కేరళలో కొన్నిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.


Read more: Bengaluru rave party: రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం.. నటి హేమకు నోటీసులు.. 


దీంతో అక్కడి వాగులన్ని నీళ్లతో నిండుకుండలా ఉన్నాయి.  రోడ్లన్ని గుంతల మయంగా మారిపోయాయి. ఘటన జరిగినప్పుడు స్థానికులు స్పందించిన తీరుపట్ల పోలీసులు, బాధిత యువకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు లేకుంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter