Bengaluru rave party: రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం.. నటి హేమకు నోటీసులు..

Actress hema: నటి హేమకు బెంగళూరు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఈ నెల 27 తమ ముందు హజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెకు రక్తం నమునాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలడంతో ఆమెకు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 25, 2024, 02:36 PM IST
  • హేమకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..
  • మే 27 తమ ముందు హజరు కావాలంటూ నోటీసులు..
Bengaluru rave party: రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం.. నటి హేమకు నోటీసులు..

Bengluru police issues notice to actress hema: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు పోలీసులు తమ ముందు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మే 27 సోమవారం రోజున తమ ముందుకు హజరు కావాలంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈరోజు జారీ చేయడం ప్రస్తుం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు 103 మందికి శాంపుళ్లను తీసుకొగా.. దానిలో 86 మందికి పాజిటివ్ అని తెలింది. ఈ నేపథ్యంలోనే  ఆమెకు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో సినిమా, రాజకీయం, పొలిటికల్ రంగాలకు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. అందరికి కూడా తమ ముందు హజరు కావడనానికి పోలీసులు.. వేర్వేరు తేదీలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

మరోవైపు రేవ్ పార్టీనీ నిర్వహించిన ఫామ్ హోస్ యజమాని గోపాల్ రావ్ కు కూడా క్రైమ్ బ్రాంచీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈయను కూడా సోమవారం మే 27 తమ ముందు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.  రేవ్ పార్టీలో ఎవరు డ్రగ్స్ ను సరఫరా చేశారు, దీని వెనుక ఉన్న పెడ్లర్ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. బెంగళూరు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. నటి హేమ బెంగళూరు పార్టీలో లేనని బుకాయించే ప్రయత్నం చేశారు. బెంగళూరు ఘటనలో దొరికిపోయిన తర్వాత కూడా ఆమె తన ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పడం, పులిహోర వండి వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ కు గురైంది. దీనికి తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పడం, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పడం కూడా ఆమెకు నెగెటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టింది.

Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

ఇక బెంగళూరు పోలీసులకు ఆమె తన పేరును కృష్ణవేణి అని చెప్పి బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది.  ఇంత చేసిన కూడా చివరకు నటి హేమ ఎఫ్ఎస్సెల్ టెస్టులలో డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా  మారింది. మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఘటన పెను దుమారంగా మారింది. ఈ ఘటనలో హేమ చేసిన పనికి ఆమెతో పనిచేసిన కొందరు స్పందించారు. మెయిన్ గా కరాటే కళ్యాణి హేమ చేసిన  పనిని ఏకీపారేశారు.

అంతేకాకుండా.. సినిమా ఇండస్ట్రీకి తాను పెద్దదానిలాగా బిల్డప్ ఇస్తు, లోపల ఇలా పాడుపనులు చేసిందంటూ తిట్టిపోసింది. హేమ చేసిన పనిని ఎవరు కూడా సమర్థించరంటూ కూడా ఆమె పై మండిపడింది. తప్పు చేసిందికాక.. అక్కడ లేడని బుకాయించడం పట్ల అనేక మంది నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మా అసోసియేషన్ కూడా హేమపై చర్యలు తీసుకొవడానికి ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News