Janasena pawan kalyan silence after Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో మే 13 న ఎన్నికలు ముగిశాయి. అప్పటి నుంచి జనసేన పవన్ కళ్యాణ్ అనేక ఏపీలో జరిగిన అనేక ఘటనలపై స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాచర్ల ఘటన తెలుగు స్టేట్స్ లను కుదిపేసింది. పిన్నెల్లి ఎన్నికల బూత్ లోకి వెళ్లి, ఈవీఎంను ధ్వంసం చేయడం ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే.. ఇటు ఈసీ ఈఘటనపై తీవ్రంగా స్పందించింది. పిన్నెల్లి కోసం పోలీసులు వేటను ప్రారంభించారు. పిన్నేల్లి తన తరపు లాయర్ల ద్వారా కోర్టులకు వెళ్లి మధ్యంతర బెయిల్ ను తెచ్చుకున్నాడు. దీనిపై ఇటు రాజకీయాల్లో తీవ్ర వివాదస్పదంగా మారింది. టీడీపీ దీనిపై తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అల్లుఅర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా రచ్చకు దారితీసింది. దీనిపై నాగబాబు ఎక్స్ వేదికగా కామెంట్లు చేయడంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఈ ఘటనపై కూడా పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.
Read more: Bengaluru rave party: రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం.. నటి హేమకు నోటీసులు..
అంతేకాకుండా.. రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా డ్రగ్స్ ఘటన సంచలనంగా మారింది. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై పోలీసులు స్పీడ్ గా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే 86 మందికి పోలీసులు నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.ఈ డ్రగ్స్ కేసులో నటి హేమ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇంతటి షాకింగ్ ఘటనలు తెలుగు రాష్ట్రాలలో సంభవిస్తున్న కూడా జనసేనాని ఏమాత్రం స్పందిచలేదు. ఇక జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయనకు డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా మంది పవన్ కళ్యాన్ ఎన్నికల తర్వాత నుంచి ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని చెబుతున్నారు. ఒకప్పటిలాగా ప్రతిదానికి దుందుడుకుగా వ్యవహరించకుండా.. వేటికైతే రెస్పాండ్ అవ్వాలో వాటికి రెస్పాండ్ అవుతున్నారని కొందరు అంటున్నారు.
Read more: Telangana: మా వాళ్లతో కొట్టిస్తాం.. డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చిన మహిళలు.. వీడియో వైరల్..
ఎన్నికల ఫలితాలలో కూటమి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కూడా జనసేన, టీడీపీ, వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాలు కీలకంగా మారిపోయాయి. అన్ని పార్టీలు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నామయి. జూన్ 4 న తామే అధికారంలోకి వస్తామంటూ వైఎస్సార్సీపీ అంటుండగా, కూటమి గెలుస్తుందని కూడా టీడీపీ అంటుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రజలు ఎవరిని ఓటు వేశారో తెలియడానికి మాత్రం మరికొన్నిరోజులు వేచీచూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter