Hyperloop Technology: మెరుపువేగంతో ప్రయాణం..త్వరలో ఇది సాధ్యం. హైస్పీడ్ రైళ్ల కంటే అతి వేగంగా, సాధారణ రైళ్ల కంటే అత్యంత వేగంగా ప్రయాణం. హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్డ్ మోడ్‌తో సాధ్యం. హైపర్ లూప్ రైలు త్వరలోనే సంచలనం సృష్టించే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో ఇప్పుడందరి దృష్టీ హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్ట్(Hyperloop Transport)మోడ్‌పైనే ఆధారపడి ఉంది. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు హైపర్ లూప్ మోడ్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వర్జిన్ గ్రూప్..హైపర్ లూప్ రైలు అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తోంది. 2014 నుంచి ట్రయల్ దశలో ఉన్న ఈ విధానం..ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. హైపర్ లూప్ రైలు.. హైస్పీడ్ రైలు(High Speed Trains) కంటే మూడు రెట్లు, సాధారణ రైలు కంటే పది రెట్లు వేగంతో ప్రయాణించగలదు. హైపర్ లూప్ రైలు(Hyperloop Train) గరిష్ట వేగం గంటకు వేయి కిలోమీటర్లుంటుంది. ఈ టెక్నాలజీ అందుబాటులో వస్తే..గణనీయంగా సమయం తగ్గుతుంది. కమర్షియల్ జెట్లకు కూడా ఇవి పోటీ ఇవ్వగలవు. హైపర్ లూప్ అంటే ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ, రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి ఉండదు. వాక్యూం రూపంలో ఉన్న గొట్టాల్లో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఫలితంగా ఏరో డైనమిక్ ప్రభావం ఉండదు. ఏ విధమైన బాహ్య ఒత్తిడి రైలుపై పడదు. అందుకే మెరుపువేగంతో ప్రయాణించగలదు. వర్జిన్(Virgin Group) హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని మరింతగా పెంచేందుకు అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీ మరింతగా ఉపయోగపడతాయి. ఈ విధానంలో ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుంది. 


హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్ట్ మోడ్‌లో ఢిల్లీ నుంచి ముంబైకు(Delhi to Mumbai in 90 minutes) అంటే 1153 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 1 గంట 22 నిమిషాల్లో ఛేదించవచ్చని హైపర్ లూప్ పోర్టల్ రూట్ ఎస్టిమేషన్‌లో పేర్కొన్నారు. అంటే సరాసరిన 90 నిమిషాల్లో ముంబై నుంచి ఢిల్లీకు వెళ్లిపోవచ్చు.


Also read: India Corona Update: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా వైరస్ సంక్రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook