కావాల్సింది చౌకిదార్ కాదు.. ప్రధాని : మోదీపై హార్థిక్ పటేల్ సెటైర్లు
కావాల్సింది చౌకిదార్ కాదు.. ప్రధాని : మోదీపై హార్థిక్ పటేల్ సెటైర్లు
చౌకిదార్‌ని వెతుక్కోవాలంటే తాను నేపాల్ వెళ్తే సరిపోతుందని, కానీ తనకు కావాల్సింది చౌకిదార్ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, విద్యార్థిని, విద్యార్థులు, యువతకు బంగారు భవిష్యత్తును అందించే ప్రధాన మంత్రి కావాలని కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ అన్నారు. తాను దేశానికి కాపలా కాస్తున్న ఓ చౌకిదార్‌ని అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకోవడాన్ని పరోక్షంగా విమర్శిస్తూ హార్థిక్ పటేల్ ఈ వ్యంగ్యస్త్రాలు సంధించారని ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు జరుగుతున్న 3వ విడత పోలింగ్‌లో పాల్గొని గుజరాత్‌లోని విరాంగామ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ హార్థిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
3వ విడత లోక్ సభ ఎన్నికలు పోలింగ్ లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్
ఓటు వేయడానికి వచ్చిన హార్థిక్ పటేల్ పోలింగ్ బూత్ వద్ద చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి రాజకీయ దుమారాన్ని రేపనున్నాయో మరి.