వయనాడ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబితే, వారణాసి నుంచి ఆ పార్టీ తరపున పోటీచేయడానికి తాను ఎంతో సంతోషిస్తానని కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించారు. కేరళలోని వయనాడ్‌లో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యే ముందు అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీ వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో మోదీపై పోటీ చేయడానికి సిద్ధమేనా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ సమాధానం చెప్పారు. 


రాహుల్ గాంధీ పోటీచేస్తోన్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో వయనాడ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న వయనాడ్‌లో ఆమె రెండు రోజులపాటు పర్యటించి ఆదివారం ఢిల్లీకి తిరిగి వెళ్లారు.