Air Force Jobs 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఆబ్జెక్టివ్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ ఇతర వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమౌతున్న యువకులుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి గుడ్‌న్యూస్ ఇది. వాయుసేన రికార్డు కార్యాలయంలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆఖరు తేదీ జూన్ 21. ఈ ఉద్యోగాలకు ఆబ్జెక్టివ్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. 


ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అన్ని పదవులకు 18 నుంచి 25 ఏళ్ల వయస్సులోబడి ఉండాలి. నవంబర్ 28, 2021 వయస్సు నిర్ధారణకు కటాప్ తేదీ. మిగిలిన ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.


దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత అర్ఙత ఆధారంగా అభ్యర్ధుల స్క్రూటినీ జరుగుతుంది. అర్హులైన అభ్యర్ధులకు లిఖితపూర్వక పరీక్ష కోసం కాల్ లెటర్ అందుుంది. లిఖిత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైతే..సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగం లభిస్తుంది. 


ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత అభ్యర్ధులు నోటిఫికేషన్, దరఖాస్తును కొనుగోలు చేసి..అవసరమైన డాక్యుమెంట్లతో  పంపించాల్సి ఉంటుంది. 


Also read: Gyanvapi Masjid: శివుడే కాదు హనుమంతుడు కూడా! జ్ఞాన్ వాపి చరిత్ర చెప్పే అరుదైన చిత్రం లభ్యం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి