IBPS RRB Notification 2021: 10,493 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
IBPS RRB Notification 2021: నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
IBPS RRB Notification 2021: కరోనా సెకండ్ వేవ్ కష్టకాలంలో నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా ఉన్న రూరల్ రీజినల్ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 10,493 పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఆఫీసర్ స్కేల్-1 (PO Posts), ఆఫీసర్ స్కేల్2, 3 పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ టాస్కింగ్) పోస్టులున్నాయి. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పరీక్ష రెండంచెల విధానంలో నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి
- IBPS దరఖాస్తుల ప్రారంభం : జూన్ 8, 2021
- దరఖాస్తుల తుది గడువు : జూన్ 28, 2021
- ఫీజు చెల్లింపు ప్రారంభం : జూన్ 8 నుంచి 28 వరకు
- ప్రి ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ : జూలై 9, 2021
- ప్రి ఎగ్జామ్ ట్రైనింగ్ తేదీ : జూలై 19 నుంచి జూలై 25, 2021 వరకు
- ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్స్ : జూలై/ఆగస్టు 2021
- ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ : ఆగస్టు 2021
- ఫీజులు : జనరల్ పోస్టులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175
Also Read: IPL 2021 Final Match: ఐపీఎల్ సీజన్ 14 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా, భారత్‌లో పండగే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook