ICAI CA INTER RESULTS 2021: ఐసీఏఐ సీఏ ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఫలితాల్లో ముంబైకు చెందిన ప్రీతి నందన్ కామత్ ఇండియా టాప్‌గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICAI CA INTER 2021 ఫలితాలు వెలువడ్డాయి. ముంబైకి చెందిన ప్రీతి నందన్ కామత్ దేశంలో టాప్‌గా నిలిచింది.7 వందలకు 388 స్కోర్‌తో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఐసీఏఐ సీఏ ఇంటర్ ఫలితాల కోసం అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ icai.nic.in, caresults.icai.org, icaiexam.icai.orgలను సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఫలితాల ప్రకటనకు సంబంధించిన వివరాలు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఫలితాల్ని మెయిల్ ద్వారా అందుకోవాలనుకునే అభ్యర్ధులు icaiexam.icai.orgలో నమోదు చేసుకోవల్సి ఉంటుందని ఐసీఏఐ(ICAI CA Inter Results) వెల్లడించింది. మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకునేవారికే ఫలితాలు నేరుగా అందుతాయి. 


ఫలితాలు ఇలా చూసుకోవాలి


ముందుగా ICAI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అనంతరం హోమ్‌పేజీలో Announcementsవిండోపై క్లిక్ చేయాలి. ఆ తరువాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీ కోర్సుకు సంబంధించిన ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. మీ రోల్ నెంబర్‌తో పాటు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. ఫలితాలు చూసుకున్న తరువాత అభ్యర్ధులు మీ పేరు, కోర్సు వివరాలు సరి చూసుకోవల్సి ఉంటుంది. తప్పులుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఐసీఏఐ (ICAI)డిసెంబర్ 2021 పరీక్ష కోసం ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభమైందని..చివరి తేదీ సెప్టెంబర్ 30 అని ఐసీఐఏ వెల్లడించింది. గడువు తేదీలోగా దరఖాస్తు చేయలేకపోతే లేట్ ఫీతో అక్టోబర్ 3 వరకూ అప్లై చేసుకోవచ్చు. ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఇంటర్ తదుపరి పరీక్షలు డిసెంబర్ 5 నుంచి 20 తేదీ వరకూ జరుగుతాయి.


Also read: Gujarat: అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా 11 ఏళ్ల బాలిక..! ఏం జరిగిందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook