Gujarat: అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా 11 ఏళ్ల బాలిక..! ఏం జరిగిందంటే..

Gujarat: ఆ బాలిక ఏడో తరగతి చదువుతోంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. కలెక్టర్ కావాలని ఎన్నో  కలలు కన్నది. కానీ ఓ ప్రాణాంతక వ్యాధి ఆమెను కాటేసింది. ఆ చిన్నారి ఆశల్ని ఆడియాశలు చేసింది. 11ఏళ్ల వయసులో  మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి కల్పించింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న  ఆ చిన్నారి కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ నిజం చేయాలనుకుంది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి...ఒక్క రోజు కలెక్టర్ గా నియమించింది. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2021, 08:04 PM IST
  • ఒక్కరోజు కలెక్టర్‌గా 11 ఏళ్ల బాలిక
  • అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
  • బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారి
Gujarat: అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా 11 ఏళ్ల బాలిక..! ఏం జరిగిందంటే..

Gujarat: ఆ బాలిక కలెక్టర్‌ కావాలనుకుంది. కానీ.. ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో ఏం చేయలేని దుస్థితి. కానీ, చివరకు ఆ 11 ఏళ్ల బాలిక కల నెరవేరింది. ఒక్కరోజు అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌(Ahmedabad District Collector)గా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. 

వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌(Gujarat)లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా అసోడియా 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె బ్రెయిన్ ట్యూమర్‌(Brain Tumor )తో బాధపడుతోంది. గత నెలలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ క్రమంలో మెరుగవుతుందనుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చిన్నారి కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్(Make a Wish Foundation) ప్రతినిధులు తెలుసుకున్నారు. చొరవ తీసుకుని చిన్నారి గురించి అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్ సాంగ్లేకు వివరించారు. చిన్నారి కలను సాకారం చేయాలని కోరారు. దీంతో చిన్నారిని ఒక్కరోజు కలెక్టర్‌(one Day Collector) చేసేందుకు ఆయన అంగీకరించారు.

Also Read: Viral news: రైతు ఖాతాలో రూ. 52 కోట్లు..షాకైన అధికారులు! అసలేం జరిగిందంటే...

‘ఫ్లోరా గురించి తెలిశాక, వారి తల్లిదండ్రులను సంప్రదించాం. ఒకరోజు కలెక్టర్‌ విషయమై అంగీకారం కోరాం. కానీ, శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పి దానికి వారు విముఖత వ్యక్తం చేశారు. చివరకు ఎలాగోలా వారిని ఒప్పించి ఆమె కలను సాకారం చేశాం’ అని కలెక్టర్‌ సందీప్‌ సాంగ్లే పేర్కొన్నారు. అంతేకాకుండా చిన్నారి పుట్టినరోజు (సెప్టెంబరు 25) వేడుకలను కూడా ముందుగానే జరిపారు. కాగా.. ఫ్లోరా(Flora Asodia) చదువులో ముందుండేదని తల్లిదండ్రులు చెప్పారు. కలెక్టర్‌ అవ్వాలనుకున్న తన కలను నెరవేర్చినందుకు సంతోషిస్తూ.. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News