ICSE, ISC Board Result 2020: ఐసీఎస్‌సీ, ఐఎస్‌సీకి సంబంధించి 10,12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఐసీఎస్‌సీ బోర్డు ( ICSE Board ) ఆఫిషియల్ నోటీస్ కూడా జారీ చేసింది. విద్యార్థులు ఈ అఫిషియల్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి సమాచారం అంతా పొందుపరిచాము అని బోర్డు తెలిపింది. ఐసీఎస్‌సీ ఫలితాలను ( ICSE Results 2020 )తెలుసుకోవడానికి విద్యార్థులు వెబ్‌సైట్ విజిట్ చేసి అక్కడ తమ కోర్సు, ఇండెక్స్ వంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. వివరాలు సరిగ్గా ఉంటే ఫలితాలు తెలుస్తాయి. దీని కోసం విద్యార్థలు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cisce.org లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏవైనా ఇబ్బందులు ఉంటే మాత్రం డైరక్ట్ లింక్ results.cisce.org విజిట్ చేసి ఫలితాలు పొందవచ్చు.Also Read : Unknown Pneumonia: చైనా పొరుగు దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICSE,ISC Results Through SMS: SMS ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.
దీని కోసం ఐసీఎస్‌సీ బోర్డు విద్యార్థులు ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫలితాల పొందవచ్చు. దీనికోసం కొత్త మెసేజ్ క్రియేట్ ఆప్షన్‌కు వెళ్లి ICSE<SPACE>Roll Number> ఎంటర్ చేయాల్సి ఉంటుంది.  తరువాత దీన్ని 09248082883 అనే నెంబర్‌పై సెండ్ చేయాల్సి ఉంటుంది.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  


#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్