IDBI Bank Recruitment 2024: మీరు డిగ్రీ పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగం సాధించడానికి ఎదురు చూస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 500 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం ఇతర వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్హత ప్రమాణాలు..
IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టా పొంది ఉండాలి.


ఇదీ చదవండి: రేపే వసంత పంచమి.. శుభసమయం, పూజావిధానం తెలుసుకోండి..


వయస్సు ..
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. కాగా, ఈ పోస్టుల భర్తీకి మార్చి 17న పరీక్ష జరగనుంది.ఈ ఖాళీల భర్తీకి అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2024 ఫిబ్రవరి 26.


ఇలా అప్లై చేసుకోండి..
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక సైట్ idbibank.inని సందర్శించి హోం పేజీలోని 'కెరీర్' ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత IDBI-PGDBF 2024 రిక్రూట్‌మెంట్ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి.
అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపండి


ఇదీ చదవండి: ఈ రాశికి 200 ఏళ్ల తర్వాత రాజయోగం.. కీర్తి ప్రతిష్ఠలు అన్నింటా విజయం!
కావాల్సిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్ ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook