Delhi HC on Oxygen supply: న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక చోట్ల ఆక్సీజన్ కొరత కారణంగా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. మరోవైపు ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాలకు వాటికి సమీపంలోని అక్సీజన్ ప్లాంట్స్ నుంచి ఆక్సీజన్ కేటాయింపులు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాష్ట్రాల సరిహద్దులు దాటుకుని వెళ్లి మరి ఆక్సీజన్ తీసుకొచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆక్సీజన్ సప్లైపై (Oxygen supply) ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సప్లైని ఎవరైనా అడ్డుకున్నారని తెలిస్తే.. వారిని ఉరి తీస్తామని ఢిల్లీ హై కోర్టు హెచ్చరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి ?


ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో ఎంత పెద్ద అధికారి అయినా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదని ఢిల్లీ హై కోర్టు మండిపడింది. అలాంటి అధికారులు ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని తక్షణమే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఢిల్లీ హై కోర్టు ఢిల్లీ సర్కారుని (Delhi govt) ఆదేశించింది. ఆక్సిజన్‌ కొరతపై ఢిల్లీలోని మహారాజ అగ్రసేన్‌ ఆస్పత్రి వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook