కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలిరోజులకు మించిన వదంతులు సెకండ్ వేవ్‌లో ప్రచారంలో ఉన్నాయి. కొందరు ముక్కులో నిమ్మరసం పోసుకుంటే కరోనా వైరస్ చనిపోతుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది నిజమని నమ్మి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్19 నిబంధనలు పాటించడం, అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడమే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్కులు ధరించకపోతే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. ఈ క్రమంలో ముఖానికి మాస్కులు ధరించడంపై గత ఏడాది నుంచి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖానికి మాస్కులను సుదీర్ఘకాలం ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుందని, కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరుగుతుందని వాట్సాప్, ఫేస్‌బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) స్పందించింది.


Also Read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే



Fact Check : కరోనా సమయంలో ముఖానికి మాస్కులు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుందని, కార్బన్ డై ఆక్సైడ్ నిల్వ పెరిగి విషపూరితమవుతుందని పోస్టు సారాంశం. అయితే అందులో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau) స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకూడదని సూచించింది. మాస్కులు సరిగ్గా ధరించండి, భౌతిక దూరం పాటించాలి, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని.. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టాలని ట్వీట్ చేసింది.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook