IGNOU Distance Education | ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ( IGNOU ) అడ్మిషన్, రీ అడ్మిషన్ డెడ్ లైన్ మరోసారి పొడిగించింది. ఇగ్నో జూలై 2020 సెషన్ విద్యార్థులు ఇకపై యూనివర్సిటీ పోర్టల్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 25, 2020 కు ముందు ignou.ac.inకు విజట్ చేసి అప్లై చేయవచ్చు. గతంలో దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ 15 సెప్టెంబర్ 2020గా నిర్ణయించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



విశ్వవిద్యాలయం ( University ) అందించిన సమాచారం ప్రకారం సెర్టిఫికెట్ అండ్ సెమిస్టర్ ఆధారిత ప్రోగ్రామ్స్ అయిన MCA, BCAM PGDMP,DGPOFA, PGDOM, PGDFRM, MPB, MP వంటి ఆరు నెలల ప్రాగ్రామ్స్ కు ఈ పొడగింపు వర్తించదు.


రిజిస్ట్రేషన్ కోసం ఈ సూచనలు పాటించండి | IGNOU July Session 2020 Admission 
1.ఇగ్నో అధికారిక పోర్టల్ ignou.ac.inను విజిట్ చేయండి.


2. హోం పేజీలో ఉండే రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.


3. అక్కడ ఉన్న Proceed to Re-registerపై క్లిక్ చేయండి


4. ఒకవేళ్ల మీరు కొత్త యూజర్ అయితే.. New Registration అనే లింక్ పై క్లిక్ చేయండి. కావాల్సిన సమాచారాన్ని అందించండి.




5. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత.. బ్యాక్ వెళ్లి మళ్లీ లాగిన్ అవ్వండి.


6. అక్కడి కోరిన సమాచారం అందించిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.


7. అప్లికేషన్ సబ్మిట్ చేయండి.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR